Monday, 21 December 2020

అఫిషియల్ న్యూస్: పవన్ రీమేక్ మూవీలో దగ్గుబాటి రానా

‘వకీల్ సాబ్’ షూటింగ్ పూర్తి కావొస్తుండటంతో పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ మరో సినిమాతో బిజీగా మారనున్నారు. మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా రీమేక్‌ తెరకెక్కుతున్న సినిమా సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్స్‌మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో పవన్‌తో పాడు మరో హీరో పాత్ర ఉంటుంది. ఇందుకోసం దగ్గుబాటి రానాను ఫిక్స్ చేసినట్లు నిర్మాణ సంస్థ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ సినిమాలో రెండో హీరోగా రానా నటిస్తాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతూనే ఉంది. ఇందులో పవర్‌ఫుల్ పోలీసుగా కనిపించనున్నారు. జనవరి తొలి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనున్నట్లు సమాచారం ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. అయితే దీనికి సంబంధించి వరుసగా లీకులు బయటపడుతుండటంతో యూనిట్‌ కలవరపడుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ చేసేందుకు నిర్మాత దిల్ రాజు ప్లా్న్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2J5WC7g
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...