Sunday, 20 December 2020

సీఎం జగన్ బర్త్‌డే సందర్భంగా మహేష్ బాబు ఇంట్రస్టింగ్ ట్వీట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు జగన్‌కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రముఖలంతా జగన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సైతం సీఎ జగన్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు. ‘ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ విజన్ మరియు కృషితో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి వైపు నడిపించాలని, మీరు మంచి ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి’ అంటూ మహేష్ ట్వీట్ చేశారు. ఇక మహేష్ ట్వీట్‌తో అటు మహేష్ బాబు అభిమానులతో పాటు..ఇటు జగన్ ఫ్యాన్స్ సైతం పండగ చేసుకుంటున్నారు. ఈ క్షణం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నామని కొందరు నెటిజన్లు ట్వీట్ చేశారు. మహేష్ సూపర్ స్టార్... జగన్ పొలిటికల్ స్టార్ అంటూ ఓ నెటిజన్ ఫోటోను షేర్ చేశారు. మరోవైపు తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం జగన్‌కు విషెస్ తెలిపారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కూడా జగన్ బర్త్ డే సందర్భంగా ట్వీట్ చేశారు. ఇటు వైసీపీలో ప్రముఖ నేతలంతా జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. Read More: మరోవైపు ఏపీలో జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు 48వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. వైఎస్ జగన్ అభిమానులు, వైసీసీ కార్యకర్తలు రాష్ట్రంలోని పలుచోట్ల ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. వైసీపీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భాకరపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో జగన్ పుట్టినరోజు సందర్భంగా 48 కేజీల భారీ కేక్‌ను వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ అభిషేక్‌రెడ్డి కట్‌ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3h4hCb8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...