ఓ చిన్న సినిమాకు పెద్ద డైరెక్టర్ అండదండ లభించడం కన్నా ప్రోత్సాహకం మరొకటి ఉంటుందా చెప్పండి. అటువంటి ప్రోత్సాహాన్ని అందుకుంది 'కమిట్‌మెంట్' మూవీ. లవ్, డ్రీమ్,హోప్, ఫైట్ అనే నాలుగు భిన్నమైన స్టోరీలను ఒకే కథలో జొప్పించి యూత్ ఆడియన్స్ టార్గెట్‌గా ఈ మూవీ రూపొందించారు మేకర్స్. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన అప్‌డేట్స్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా (గురువారం) 'కమిట్‌మెంట్' టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. నరేశ్ కుమరన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో టైటిల్ సాంగ్‌ను పూర్ణాచారి రాయగా, శ్రీ కావ్య చందన, నరేశ్ కుమార్ పాడారు. నలుగురు మహిళల జీవితంలోకి పురుషులు ఎంటయ్యాక వారి వారి జీవితాలపై కమిట్‌మెంట్ ప్రభావం ఎలా పడిందనేది ఈ సినిమాలో చూపించనున్నారు. ఖచ్చితంగా తమ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు దర్శకనిర్మాతలు. Also Read: లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో , అన్వేషి జైన్, రమ్య పసుపిలేటి, సూర్య శ్రీనివాస్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఇందులో తేజస్వి చాలా బోల్డ్ క్యారెక్టర్ చేసిందని సమాచారం. ఈ సినిమాను రచన మీడియా వర్క్స్ సమర్పణలో ఎఫ్3 ప్రొడక్షన్, ఫూట్ లూస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై బల్‌దేవ్‌సింగ్, నీలిమ. టి నిర్మిస్తున్నారు. అతిత్వరలో ఈ మూవీ విడుదల కానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oEP1M2
v
No comments:
Post a Comment