Thursday, 10 December 2020

‘నేడే విడుదల’ ప్రీ లుక్ .. ఆకట్టుకుంటున్న పోస్టర్

ఐకా ఫిల్మ్ ఫాక్టరీ బ్యానర్‌పై అసిఫ్ ఖాన్, మౌర్యాని జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘’. రామ్‌రెడ్డి పన్నాల డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫ్రీ లుక్‌ను యూనిట్ గురువారం విడుదల చేశారు. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ద్వారా సినిమా పబ్లిసిటీలో కొత్త విధానానికి నాంది పలికినట్లు యూనిట్ తెలిపింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే ఫస్ట్‌లుక్, పాటలు విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఆసక్తికరమైన కథతో, ఆలోచింపచేసే కథనంతో, ఆహ్లాదపరిచే సంభాషణలతో, విన్నూతనమైన ప్రచారంతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్ల యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో కాశీ విశ్వనాథ్, అప్పాజీ అంబరీషా, మాధవి, టీఎన్ఆర్, అదుర్స్ ఆనంద్, పీలా గంగాధర్, జబర్దస్ నవీన్, అశోక్ వర్ధన్, రసజ్ఞ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా వివరాలు సంగీతం: అజయ్ అరసాడ లిరిక్స్: శ్రీమణి కెమెరా: సీహిచ్ మోహన్ చారి ఎడిటింగ్: సాయి బాబు తలారి ఫైట్స్: అంజి ఆర్ట్ డైరెక్టర్: సీహెచ్ రవి కుమార్ వీఎఫ్ఎక్స్: ఆర్.అంకోజీ రావు నిర్మాతలు: నజురుల్లా ఖాన్, మస్తాన్ ఖాన్ రచన, దర్శకత్వం: రామ్ రెడ్డి పన్నాల


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qEBoyx
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...