Thursday, 10 December 2020

ఏ తండ్రైనా అవే కలలు కంటాడు.. నా పద్మ వల్లే ఇదంతా!! నిహారిక పెళ్లిపై నాగబాబు ఎమోషనల్ కామెంట్స్

ప్రతి మగాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుందనేది పెద్దలు చెప్పిన మాట. ఇప్పుడు అదే మాట చెబుతూ ఎమోషనల్ అయ్యారు మెగా బ్రదర్ . తన కూతురు నిహారిక పెళ్లిని అంగరంగ వైభవంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జరిపించడంలో తన భార్య పద్మ ఎంతో సహకారం అందించిందని పేర్కొంటూ పెళ్లి సంబరాల్లో ఆమెతో దిగిన ఓ పిక్ షేర్ చేశారు నాగబాబు. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. నిన్న (బుధవారం) రాత్రి వేదపండితులు నిర్ణయించిన ముహూర్తానికి నిహారిక- చైతన్య మూడుముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. తెలుగు సంప్రదాయం ప్రకారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న హోటల్ ది ఒబెరాయ్ ఉదయ్‌విలాస్‌లో అత్యంత వైభవంగా ఈ వేడుక జరిగింది. కొణిదెల, అల్లు కుటుంబాలతో పాటు కొంతమంది సన్నిహితులు, బంధుమిత్రులు ఈ పెళ్లి వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Also Read: కాగా, తాజాగా తన కూతురు గురించి ఓ పోస్ట్ పెడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు నాగబాబు. ''కూతురి పెళ్లంటే ఏ తండ్రికైనా చాలా క్లిష్టమైన పని. తన కూతురి పెళ్లిని చాలా గొప్పగా జరపాలని ప్రతి తండ్రి కలలు కంటాడు. నేనూ అలాంటి ఓ తండ్రినే. అయితే ఈ శుభకార్యాన్ని అత్యంత సులభంగా పూర్తిచేయడంలో నా భార్య పద్మ అన్ని విధాలుగా సహకారం అందించింది'' అని నాగబాబు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన మెగా ఫ్యాన్స్ నిహారికకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VYdP5F
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...