Wednesday, 9 December 2020

Sri Reddy: రేయ్.. ఏంట్రా ఒకటే పిసికేసుకుంటున్నారు!! నిహారిక పెళ్లిపై శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్

నిన్న (బుధవారం) మెగా డాటర్ నాగబాబు కూతురు వేడుక ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులందరి సమక్షంలో వెంకట చైతన్యను వివాహమాడింది నిహారిక. రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరై సందడి చేశారు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబాలతో పాటు అల్లు ఫ్యామిలీ అంతా వచ్చి ఎంజాయ్ చేసింది. దీంతో ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా పెళ్లి, సోషల్ మీడియా హంగామా విషయమై రియాక్ట్ అవుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది . క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమ తర్వాత మెగా ఫ్యామిలీ అంటే అంతెత్తున ఎగిసిపడుతున్న శ్రీ రెడ్డి.. ఏ మాత్రం అవకాశం దొరికినా ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో పవన్ కళ్యాణ్‌పై, మెగా ఫ్యామిలీపై విరుచుకుపడుతోంది. లాజిక్స్ మాట్లాడుతూ రచ్చరచ్చ చేస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే మెగా డాటర్ నిహారిక పెళ్లి ఫొటోలు, వీడియోల విషయమై ఆమె ఓ వీడియో ద్వారా మాట్లాడిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి లాగ, మీ ఇంట్లో పెళ్లి లాగా మీరెందుకురా తెగ హడావిడి చేస్తూ పిసికేసుకుంటున్నారంటూ యూట్యూబర్లపై సెటైర్స్ వేసింది శ్రీ రెడ్డి. నాగబాబు కూతురు పెళ్లి అయితే అంత అవసరామా? మీకు. ''యూ ట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు.. పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఆయనొచ్చాడు, ఈయనొచ్చాడు, ఆయన డాన్సులు చేశాడు.. ఏంట్రా? ఏదైనా ఉపయోగపడే పని చేయండిరా. ఆ రైతులు రోడ్లమీదకొచ్చి ఏడుస్తుంటే సపోర్ట్ చేయడం తెలియదు కానీ ఈ చెత్త మాత్రం షేర్స్ కొట్టుకుంటూ అబ్బా! అనడం.. ఛీ, చేంజ్ కండిరా'' అంటూ శ్రీ రెడ్డి ఫైర్ అయింది. Also Read: అంతటితో ఆగక.. మీడియా కూడా దీన్ని అంత హైలైట్ చేయాల్సిన పని లేదని, దేశంలో హైలైట్ చేయాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయంటూ రెచ్చిపోయిన శ్రీ రెడ్డి చివరగా పనికిరాని ఎదవల్లారా! అంటూనే తప్పించుకునే ప్రయత్నం చేసింది. నేనన్నది మీడియాను కాదు.. ఇలాంటి పెళ్లిళ్లన్నీ చూసేవాడిని అంటున్నా.. పోరా అంటూ ముగించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gucpt0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...