Thursday, 10 December 2020

‘ఆచార్య’ నిర్మాణ సంస్థతో శ్రీవిష్ణు హీరోగా సినిమా

‘క్షణం’, ‘ఘాజి’, ‘గ‌గ‌నం’ లాంటి మంచి కంటెంట్ ఉన్న క‌మ‌ర్షియ‌ల్ హిట్ సినిమాల్ని నిర్మించిన నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా ‘ఆచార్య’, కింగ్ నాగార్జున్ హీరోగా ‘వైల్డ్ డాగ్’ లాంటి క్రేజీ ఫిలిమ్స్‌ను నిర్మిస్తోంది. అలాగే, ‘ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ’ చిత్రంతో డైరెక్టర్‌గా ప‌రిచ‌య‌మైన స్వరూప్ ఆర్‌.ఎస్‌.జె. ద‌ర్శక‌త్వంలో ఓ మీడియం బ‌డ్జెట్ మూవీని ప్రొడక్షన్ నెంబర్ 8గా ఇటీవ‌ల ప్రకటించింది. ఇప్పుడు శ్రీవిష్ణు హీరోగా మరో చిన్న సినిమాను ప్రారంభించింది. శ్రీ‌విష్ణు హీరోగా, ‘జోహార్’ ఫేమ్ తేజ మార్ని ద‌ర్శక‌త్వంలో తమ తొమ్మిదో చిత్రాన్ని మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రకటించింది. కేప‌ర్ కామెడీగా రూపొందే ఇంకా టైటిల్ నిర్ణయించ‌ని ఈ సినిమా గురువారం హైద‌రాబాద్‌లోని సంస్థ కార్యాల‌యంలో పూజా కార్యక్రమాల‌తో మొద‌లైంది. అన్వేష్ రెడ్డి, శ్రీ‌విష్ణు, అమృతా అయ్యర్ క‌లిసి సినిమా స్క్రిప్టును ద‌ర్శక నిర్మాత‌ల‌కు అంద‌జేశారు. ముహూర్తపు స‌న్నివేశానికి డైరెక్టర్ వివేక్ ఆత్రేయ క్లాప్‌నివ్వగా, సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ శివ‌లెంక కృష్ణప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దీనికి స్వరూప్ ఆర్‌.ఎస్‌.జె. గౌర‌వ ద‌ర్శక‌త్వం వ‌హించారు. త‌న తొలి తెలుగు సినిమా విడుద‌ల కాక‌మునుపే అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోన్న అమృతా అయ్యర్ ఈ చిత్రంలో శ్రీ‌విష్ణు జోడీగా న‌టిస్తున్నారు. నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎన్‌.ఎమ్‌. పాషా స‌హ నిర్మాత‌. ద‌ర్శక‌త్వం వ‌హిస్తుండ‌టంతో పాటు క‌థ‌, స్క్రీన్‌ప్లేల‌ను తేజ మార్ని అందిస్తుండ‌గా, సుధీర్ వ‌ర్మ పి. డైలాగ్స్ రాస్తున్నారు. ఈ నెల‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌య్యే ఈ చిత్రానికి ప్రియ‌ద‌ర్శన్ బాల‌సుబ్రమ‌ణియ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, జ‌గ‌దీష్ చీక‌టి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఇంకా న‌రేష్‌, శివాజీ రాజా, సుబ్బరాజు, దేవీ ప్రసాద్‌, ‘రంగ‌స్థలం’ మ‌హేష్‌, రాజ్‌కుమార్ చౌద‌రి (‘రాజావారు రాణిగారు’ ఫేమ్‌), చైత‌న్య (‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఫేమ్‌) నటిస్తున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JI1rEl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...