Thursday, 10 December 2020

బాలకృష్ణ పొలిటికల్ టచ్.. ఆ లోటు తీర్చడమే టార్గెట్! ఎనర్జిటిక్ డైరెక్టర్‌తో పక్కా ప్లాన్

ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా థియేటర్స్ మూగబోయాయి. నిత్యం సరికొత్త కథాంశాలతో ప్రేక్షకులను అలరించే సినిమా హాళ్ళన్నీ బోసిపోయి కనిపించాయి. జనవరిలో వచ్చిన ''సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో'' సినిమాల తర్వాత వెండితెరపై మరో సూపర్ హిట్ మూవీనే కనిపించలేదు. పలువురు స్టార్ హీరోల సినిమాలు సెట్స్ పైనే ఆగిపోవడంతో సగటు సినీ ప్రేక్షకుడు నిరాశ చెందాడు. దీంతో వచ్చే ఏడాది ఆ లోటు తీర్చుతూ గతేడాది జ్ఞాపకాలు మరిచేలా రంగంలోకి దిగాలని ప్లాన్ చేస్తున్నారట నందమూరి నటసింహం . కుర్ర హీరోలతో పోటీపడి సినిమాలు చేసే నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది వీళ్లిద్దరి కాంబోలో రాబోతున్న హాట్రిక్ సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే కరోనా కారణంగా షూట్స్ రద్దు కావడంతో ఈ ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేక పోతున్నారు. అలా 2020లో సిల్వర్ స్క్రీన్‌పై బాలయ్య బొమ్మ పడలేదు. దీంతో వచ్చే ఏడాది తన స్పీడ్ మరింత పెంచాలని భావించిన ఆయన వరుస సినిమాలు ఓకే చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బాలయ్యబాబు ఇమేజ్‌కు తగ్గట్లు డైరెక్టర్ ఓ కథ సిద్ధం చేశారట. ఇది విన్న బాలకృష్ణ వెంటనే ఓకే చెప్పి డేట్స్ ఇచ్చారట. పొలిటికల్ టచ్ కథతో ఈ సినిమా రూపొందనుందని, దీనికి 'బలరామయ్య బరిలోకి దిగితే' అనే టైటిల్ పరిశీలనలో పెట్టారనే టాక్ వినిపిస్తోంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని సమాచారం. బోయపాటి సినిమాతో పాటు ఈ మూవీతో ఈ ఏడాది తన సినిమాలు లేని లోటు పూడ్చుతూ వచ్చే ఏడాది నందమూరి ఫ్యాన్స్‌ని హుషారెత్తించాలని బాలయ్య టార్గెట్ పెట్టుకున్నారట. సో.. చూడాలి మరి ఈ మూవీ అఫీషియల్ ప్రకటన ఎప్పుడొస్తుందనేది!.
  • Also Read:
  • Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3m6BMC8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...