Thursday, 10 December 2020

శ్రీ‌నివాస్ రెడ్డి, స‌ప్తగిరి హీరోలుగా ‘హౌస్ అరెస్ట్’

శ్రీ‌నివాస్ రెడ్డి, స‌ప్తగిరి హీరోలుగా ‘90 ఎంఎల్’ ఫేమ్ శేఖ‌ర్‌రెడ్డి యెర్ర ద‌ర్శక‌త్వంలో ‘హౌస్ అరెస్ట్’ అనే సినిమా ప్రారంభమైంది. ప్రైమ్ షో ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో గురువారం ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ సైతం నేటి నుంచే జరుగుతోంది. శ్రీ‌నివాస్ రెడ్డి, స‌ప్తగిరిల‌పై చిత్రీక‌రించిన ముహూర్తపు స‌న్నివేశానికి డైరెక్టర్ కె.ఎస్. రవీంద్ర (బాబీ) క్లాప్‌నిచ్చారు. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా వ్యవ‌హ‌రిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా.. జె. యువ‌రాజ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, చోటా కె. ప్రసాద్ ఎడిట‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు. ‘అదుర్స్’ రఘు, రవి ప్రకాష్, సునయన ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే, శ్రీనివాస్ రెడ్డి హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా కిందటేడాది ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. శ్రీనివాస్ రెడ్డికి నష్టాన్ని మిగిల్చింది. అలాగే, సప్తగిరి హీరోగా కిందటేడాది ‘వజ్రకవచధర గోవింద’ సినిమా వచ్చింది. ఇది కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. గతేడాది వీరిద్దరూ కమెడియన్లుగా పలు చిత్రాల్లో నటించారు. అయితే, ఇప్పుడు మరోసారి హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అది కూడా కలిసి. చూద్దాం హిట్టు అందుకుంటారో లేదో.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2K8s6Kn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...