Thursday, 10 December 2020

నిహారికకు ఖరీదైన బహుమతులు ఇచ్చిన మెగా హీరోలు.. వాటి విలువ రూ.5 కోట్ల పైమాటే!

మెగా డాటర్ కొణిదెల వివాహం వెంకట చైతన్య జొన్నలగడ్డతో డిసెంబర్ 9న అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఉదయ్‌పూర్‌లోని ది ఒబెరాయ్ ఉదయ్‌విలాస్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలో మెగా ఫ్యామిలీ మొత్తం పాల్గొంది. వీరితో పాటు పెళ్లికుమారుడి కుటుంబ సభ్యులు, ఇతర స్నేహితులు పెళ్లిలో పాల్గొని సందడి చేశారు. అలాగే, మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, శిరీష్ పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలుగు సంప్రదాయం ప్రకారం తన కుమార్తె వివాహాన్ని ఘనంగా జరిపించారు మెగా బ్రదర్ నాగబాబు. See Photos: ఇదిలా ఉంటే, పెళ్లి వేడుకను జరపడానికి ఉదయ్‌పూర్ వెళ్లడానికి ముందు రోజు అంటే ఆదివారం హైదరాబాద్‌లోని నాగబాబు ఇంట్లో నిహారిక పెళ్లికూతురు ఫంక్షన్ జరిగింది. ఆ రోజు తన తమ్ముడు కుమార్తెకు మెగాస్టార్ చిరంజీవి ఒక ఖరీదైన బహుమతిని అందజేశారు. ఒక అందమైన పెట్టెను నిహారిక ఒళ్లో పెట్టి ఆమెతో చిరంజీవి, సురేఖ దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నిహారికకు చిరంజీవి ఇచ్చిన ఆ పెట్టెలో డైమండ్ నెక్‌లేస్ ఉందని వార్తలు వచ్చాయి. దీని విలువ ఏకంగా రూ.2 కోట్లు అని ఇండస్ట్రీ వర్గాలు చెవులు కొరుక్కున్నాయి. See Photos: అయితే, నిహారికకు కేవలం చిరంజీవి మాత్రమే కాకుండా మెగా హీరోలందరూ జీవితాంతం గుర్తుండిపోయే ఖరీదైన బహుమతులు ఇచ్చారని ప్రస్తుత సమాచారం. రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ కూడా నిహారికకు ఖరీదైన బహుమతులు ఇచ్చారట. మొత్తం మీద మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలందరూ నిహారికకు అందజేసిన బహుమతుల విలువ రూ.5 కోట్ల పైమాటేనని టాక్. ఎప్పుడూ నవ్వుతూ చలాకీగా ఉండే నిహారిక అంటే మెగా హీరోలందరికీ చాలా ఇష్టమట. అందుకే, ఇంత ఖరీదైన బహుమతులు అందజేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oEE5hI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...