Wednesday, 2 December 2020

అనుకోకుండా ఆగిన ‘పుష్ప’ షూటింగ్.. హైదరాబాద్ బయలుదేరిన బన్నీ!!

లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ హీరోగా రూపొందుతోన్న ‘పుష్ప’ సినిమాపై తాజాగా ఓ షాకింగ్ రూమర్ చక్కర్లు కొడుతోంది. ‘పుష్ప’ యూనిట్‌లో కొంత మందికి కొవిడ్-19 లక్షణాలు కనిపించడంతో అంతా షాకయ్యారట. దీంతో డైరెక్టర్ సుకుమార్ అస్సలు సమయాన్ని వృథా చేయకుండా షూటింగ్‌ను ఆపేసి అనారోగ్యంతో ఉన్నవారిని హాస్పిటల్‌కు పంపించారట. షూటింగ్‌ను తాత్కాలికంగా ఆపేసిన ‘పుష్ప’ టీమ్ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ‘పుష్ప’ షూటింగ్ ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే. నవంబర్‌లో ప్రారంభమైన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇలాంటి సమయంలో షూటింగ్‌ను ఆగిందనే వార్త చిత్ర యూనిట్‌తో పాటు బన్నీ అభిమానులకూ షాకింగే. అయితే, ప్రస్తుతానికి ఇది వదంతు మాత్రమే. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోన్న ‘పుష్ప’ చిత్రం ఎర్రచందనం దుంగల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుంది. పుష్ప రాజ్ అనే ఎర్రచందనం స్మగ్లర్‌గా అల్లు అర్జున్ కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని ముత్తంశెట్టి మీడియా సౌజన్యంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. మిరోస్లావ్ కూబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, హరీష్ ఉత్తమన్, వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్, అనీష్ కురువిల్ల ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2I0EUBB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...