Wednesday, 2 December 2020

పవన్ ఒడిలో అకీరా, ఆధ్య.. అరుదైన క్షణం అంటూ ఫొటో షేర్ చేసిన రేణు దేశాయ్

సెలబ్రిటీలు సోషల్ మీడియాలో షేర్ చేసే కొన్ని ఫొటోలు తెగ వైరల్ అయిపోతూ ఉంటాయి. దానికి చాలా కారణాలే ఉండొచ్చు. ఆ ఫొటోలోని పాజిటివ్, నెగిటివ్ అంశాలు.. ఆ ఫొటోను షేర్ చేసిన వ్యక్తి.. ఇవన్నీ ఆ ఫొటో వైరల్ అవడానికి కారణాలు అవుతాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక ఫొటో కూడా ఇలానే వైరల్ అవుతోంది. దీనికి కారణం ఆ ఫొటో రేణు దేశాయ్ మాజీ భర్త పవన్ కళ్యాణ్‌ది కావడమే. తన పిల్లలు అకీరా, ఆద్యతో ఉన్న ఒక అందమైన ఫొటోను రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇది పాత ఫొటో. పవన్ కళ్యాణ్ గుండెలపై అకీరా, ఆద్య తలపెట్టి నిద్రపోతున్నట్టు ఈ ఫొటోలో కనిపిస్తోంది. దీన్ని అరుదైన క్షణంగా రేణు దేశాయ్ అభివర్ణించారు. ‘‘కొన్ని అందమైన ఫొటోలను షేర్ చేసుకోవాలి. అవి కేవలం మీ ఫోన్‌లో ఫొటో ఆల్బమ్‌లో ఉండిపోకూడదు. కొన్ని అరుదైన క్షణాలను నా ఫోన్ కెమెరాతో నేను స్వయంగా క్యాప్చర్ చేశాను’’ అని రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అంటే, ఈ ఫొటో తన ఫోన్ కెమెరాతో స్వయంగా రేణు దేశాయ్ తీసిన ఫొటో. ఈ అందమైన ఫొటోను షేర్ చేయకుండా రేణు దేశాయ్ ఉండలేకపోయారు. ఈ పాయింట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. అందుకే వారు ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కాగా, పవన్ కళ్యాణ్‌ను ప్రేమించి పెళ్లిచేసుకున్న రేణు దేశాయ్.. 2012లో ఆయన నుంచి విడిపోయారు. ఆ తరవాత తన పిల్లలిద్దరితో కలిసి స్వస్థలం పుణే వెళ్లిపోయారు. అక్కడ మరాఠి సినిమాకు దర్శకత్వం వహించారు. అలాగే, మరాఠి సినిమాలను నిర్మించారు. ఇప్పుడు తెలుగులో ఒక సినిమా చేస్తున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33DmlLn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...