యాక్టింగ్ రీసర్చ్ ద్వారా ఎంతోమంది హీరోహీరోయిన్లను, నటీనటులను సినీ పరిశ్రమకు అందించిన యాక్టింగ్ గురు మహేశ్ గంగిమల్ల దర్శకుడిగా మారాడు. తన స్వీయ దర్శకత్వంలో అభినయ జాపిక ప్రొడక్షన్ బ్యానర్‌పై '' అనే టైటిల్‌తో కొత్త సినిమా రూపొందిస్తున్నారు. పాత, కొత్త నటీనటుల కలయికతో ఈ మూవీ రూపొందించనున్నారు. చిత్రంలో లలిత్ ఆదిత్య, మల్లేశం ఫేమ్ , సాయి రాఘవేంద్ర, సుందర్, రమణ కీలకపాత్రల్లో నటించనున్నారు. తాజాగా ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. నిర్మాత భూపాల్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, హీరో రాకేశ్ వర్రే క్లాప్ కొట్టాడు, యువ దర్శకుడు మాధవ్ కోదాడ్ గౌరవ దర్శకత్వం వహించారు. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నాం అని, ఈ సినిమాలో తన స్టూడెంట్స్‌తో పాటు, కొత్త వారికోసం త్వరలో 'టాలెంట్ హంట్' అనే ప్రోగ్రాం చేయబోతున్నాం అని మహేశ్ గంగిమల్ల తెలిపారు. Also Read: ఈ సందర్భంగా అనన్య నాగళ్ల మాట్లాడుతూ.. స్క్రిప్ట్ గురించి ముందే తెలుసు కాబట్టి ఈ విలక్షణ కథాంశంలో నటించడం కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నానని అన్నారు. మా యాక్టింగ్ గురువే దర్శకుడు అవడం మాకు ఆనందంగా ఉందని మిగితా నటీనటులు పేర్కొన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36ybiVC
v
No comments:
Post a Comment