Thursday, 3 December 2020

భార్యను రంగంలోకి దించుతున్న దిల్ రాజు.. బడా ప్రొడ్యూసర్ ప్లాన్ చూశారా? స్కెచ్ అదిరిందిలే..

దిల్ రాజు.. తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం అక్కర్లేని పేరిది. కెమెరా ముందు కనిపించకపోయినా పేరు మాత్రం నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తెర వెనకాలే ఉంటూ సినిమాకు సర్వ హంగులు దిద్ది ప్రేక్షకుల ముందుంచడం ఈ బడా ప్రొడ్యూసర్ స్టైల్. ఆయన నిర్మాణంలో సినిమా వస్తుందంటే చాలు బ్లాక్‌బస్టర్ పక్కా అనే సెంటిమెంట్ బిల్డ్ అయింది. అయితే ఇకపై ఆయన సతీమణిని కూడా రంగంలోకి దించి మరిన్ని విజయాలందుకోవాలని పర్ఫెక్ట్ ప్లాన్ రెడీ చేశారట దిల్ రాజు. తన మొదటి భార్య అనిత గుండెపోటుతో మరణించడంతో కొన్నేళ్లపాటు ఒంటరి జీవితం గడిపిన దిల్ రాజు.. కూతురు కోరిక మేరకు లాక్‌డౌన్ వేళ రెండో పెళ్లి చేసుకున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అగ్ని సాక్షిగా (వైఘా రెడ్డి)ని ఆయన పెళ్లాడారు. మార్చి నెలలో వీరి వివాహం జరిగింది. అయితే తేజస్విని కథలు రాయడం పట్ల మక్కువ ఉందని గమనించిన దిల్ రాజు.. తన రూట్ లోనే ఆమెను కూడా ఇండస్ట్రీలోకి దించాలని ప్లాన్ చేశారని తెలుస్తోంది. Also Read: లాక్‌డౌన్ వేళ థియేటర్స్ మూతబడటంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ హవా ఎక్కువైపోయింది. రానున్న రోజుల్లో ఈ మాద్యమాలకే డిమాండ్ ఉంటుందని విశ్లేషకులు చెబుతున్న నేపథ్యంలో దిల్ రాజు కూడా ఓటీటీ వేదికల కోసం ప్రత్యేకంగా కథలు డెవలప్ చేయాలని చూస్తున్నారట. ఈ క్రమంలో తన భార్య తేజస్వి వినిపించిన ఓ స్టోరీలైన్ విని ఫిదా అయిన ఆయన.. వెంటనే ఆ స్టోరీ డెవలప్ చేయాల్సిందిగా టీమ్‌ని ఆదేశించారట. ఈ కథనే ఓ వెబ్ సీరిస్‌గా మలిచి తన సినిమాల పరంగా సతీమణిని అందరికీ పరిచయం చేయాలని ఫిక్సయ్యారట దిల్ రాజు. సో.. చూడాలి మరి ఆయన ఆలోచనను ఎంత వరకు సక్సెస్ చేస్తారనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qmZb5R
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...