Thursday, 3 December 2020

స్టార్ హీరోతో అనసూయ సరదా క్షణాలు.. బాబోయ్! బాండింగ్ మామూలుగా లేదే.. షాకవుతున్న నెటిజన్స్

బుల్లితెర హాట్ యాంకర్ భరద్వాజ్ క్రేజ్ ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. ఆమె కనిపిస్తే చాలు ఆడియన్స్‌లో ఏదో తెలియని జోష్ కనిపిస్తుంటుంది. మరోవైపు ఆన్‌లైన్ వేదికలపై ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తూ ఆకట్టుకోవడం ఈ జబర్దస్త్ బ్యూటీ నైజం. కాగా నిత్యం తన లేటెస్ట్ ఫోటోషూట్స్ అప్‌లోడ్ చేస్తూ మత్తెక్కించే అనసూయ.. తాజాగా ఓ స్టార్ హీరోతో గడిపిన సరదా క్షణాలను నెటిజన్ల ముందుంచింది. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్‌గా మారి తెగ చెక్కర్లు కొడుతోంది. ఉన్నట్టుండి సౌత్ ఇండియన్ స్టార్ విజయ్ సేతుపతితో నవ్వులు చిందిస్తూ కనిపించి షాకిచ్చింది అనసూయ భరద్వాజ్. అంతేకాదు ఆ ఫోటోని స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ.. 'టాలెంటెడ్ పర్సన్‌తో బాండింగ్' అంటూ తనదైన స్టైల్ కామెంట్ వదిలింది. ఇందులో విజయ్ భుజం మీద చేతులు వేసి మరీ అత్యంత సన్నిహితంగా కనిపిస్తోంది అనసూయ. అయితే ఈ ఫోటో ఎందుకు దిగింది? సందర్భం ఏంటి? అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో స్టార్ హీరో విజయ్ సేతుపతితో కలిసి అనసూయ నటించబోతోందా? అనే అనుమానాలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. ఇకపోతే ''బాబోయ్! బాండింగ్ మామూలుగా లేదే, బ్యూటిఫుల్, కాంబో సూపర్'' అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ పిక్ చూసిన నెటిజన్లు. ఈ క్రేజీ జోడీని వెండితెరపై చూడాలని ఉందంటూ తమ కోరిక బయటపెడుతున్నారు. Also Read: అటు బుల్లితెర, ఇటు వెండితెరపై సత్తా చాటుతూ స్పెషల్ ఇమేజ్ కూడగట్టుకున్న అనసూయ.. ప్రస్తుతం '' అనే సినిమాలో ఛాలెంజింగ్ రోల్ పోషిస్తోంది. ఇందులో గర్భవతిగా ఆమె కనిపించనుండటం విశేషం. ఇటీవలే అనసూయ ప్రెగ్నెంట్‌గా ఉన్న పోస్టర్‌ని ఫస్ట్‌లుక్‌గా విడుదల చేసి ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2IaaNIa
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...