Saturday, 12 December 2020

ప్రభాస్ ‘సలార్’లో మరో ఇద్దరు స్టార్ హీరోలు?

యంగ్ రెబల్ స్టార్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బాహుబలి, బాహుబలి-2 చిత్రాల తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా అవతరించిన ప్రభాస్‌ బాలీవుడ్‌లోనూ భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘రాధేశ్యామ్’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఓం రౌత్ డైరెక్షన్లో ‘ఆదిపురుష్’ షూటింగ్ ప్రారంభం కానుంది. Also Read: దీంతో పాటు ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘’ సినిమాను ఇటీవలే ప్రకటించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మరో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్నట్లు తెలుస్తోంది. కీలక పాత్రల్లో దగ్గుబాటి రానా, మోహన్‌లాల్ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రానా-ప్రభాస్ కలిసి బాహుబలి సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. మరోవైపు మోహన్‌లాల్ తెలుగులో ఎన్టీఆర్‌తో కలిసి ‘జనతా గ్యారేజీ’ సినిమాలో నటించారు. తాజాగా ‘సలార్’లో ప్రభాస్‌తో కలిసి రానా, మోహన్‌లా్ కలిసి నటిస్తున్నారన్న వార్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇది నిజమో కాదో తెలియాలంటూ యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3m7GmjP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...