Saturday, 12 December 2020

Kalaposhakulu Trailer: బాగా బలిసిన క్యాండెట్ కావాలంటూ ఆమెతో డైరెక్టుగా! వీడియో వైరల్

ఈ రోజుల్లో చిన్న సినిమా అయినా అట్రాక్ట్ చేసే కంటెంట్ ఉండాలేగానీ భారీ ఆదరణ దక్కుతుండటం చూస్తున్నాం. అలాంటి కోవలోనే '' పేరుతో ఓ కొత్త సినిమా రాబోతోంది. యూత్ ఆడియన్స్‌ని ఆకర్షించే లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునే సెంటిమెంట్ ఎలిమెంట్స్ కలగలిపి ఓ డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసిన యూనిట్ సభ్యులు.. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. 2 నిమిషాల 27 సెకనులతో కూడిన ఈ ట్రైలర్‌లో ఆసక్తికర సన్నివేశాలు చూపించి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. డబ్బు అంటే పడిచచ్చే ఓ యువకుడి ప్రేమకథను చాలా డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేయబోతున్నారని ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ''నీకు నాకు సెట్ కాదు కానీ.. నీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా బాగా బలిసిన క్యాండెట్ ఉంటే చెప్పు సెట్ చేసుకుంటా'' అంటూ హీరోయిన్‌తో హీరో చెప్పిన డైలాగ్, చివరగా 'పైసలంటే పడిసచ్చే పక్కా పోరంబోకులు వీళ్ళు' అంటూ వస్తున్న బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఈ ట్రైలర్‌లో హైలైట్ అవుతున్నాయి. Also Read: 'ఆ నలుగురు' చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన విశ్వకార్తికేయ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై చలపతి పువ్వుల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో దీప ఉమావతి హీరోయిన్‌గా నటించింది. న‌టుడు జెమిని సురేష్ ముఖ్య పాత్ర పోషించారు. సెన్సార్ నుంచి యు/ఎ సర్టిఫికెట్ పొందిన ఈ మూవీ డిసెంబర్ 18వ తేదీన విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mbcItO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...