Saturday, 12 December 2020

వైరల్ అవుతున్న విక్టరీ వెంకటేష్ న్యూ లుక్.. అభిమానుల కోసం బర్త్ డే స్పెషల్ ట్రీట్

గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో తనదైన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నారు దగ్గుబాటి వారసుడు . ఎన్నో మరపురాని విజయాలందుకొని 'విక్టరీ'నే తన ఇంటి పేరుగా మార్చుకున్న ఆయన రేపటితో (డిసెంబర్ 13) 60వ వసంతాలు పూర్తి చేసుకోనున్నారు. ఈ సందర్భంగా తన లేటెస్ట్ మూవీ '' నుంచి ప్రత్యేకమైన అప్‌డేట్ సిద్ధం చేయడమే గాక.. న్యూ లుక్‌లో ఫోటో షూట్‌లో పాల్గొని అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారాయన. ఈ ఫొటోల్లో వెంకీ స్మార్ట్ లుక్ చూసి ఫిదా అవుతున్నారు దగ్గుబాటి ఫ్యాన్స్. ఈ స్టిల్స్‌లో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో, గెడ్డంతో స్టైలిష్‌గా అట్రాక్ట్ చేస్తున్నారు వెటరన్ స్టార్ వెంకటేష్. ట్రెమెండస్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న ఈ స్టిల్స్ కాజువల్‌గా తీసినవే అని చెప్తున్నప్పటికీ, ఫ్యూచర్‌లో రాబోయే ఫిల్మ్‌లో ఖచ్చితంగా ఈ స్టైలిష్ లుక్‌తో విక్టరీ వెంకటేష్ ప్రేక్షకులను, అభిమానులను అలరించనున్నారని తెలుస్తోంది. Also Read: ఇకపోతే ప్రస్తుతం వెంకటేష్ 'నారప్ప' మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో పవర్‌ఫుల్, ఇంటెన్స్ రోల్‌లో ఆయన కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. వెంకీ పుట్టినరోజు సందర్భంగా 'నారప్ప' గ్లింప్స్ ఈ రోజు (డిసెంబర్ 12) రాత్రి 8:00 గం లకు విడుదల చేయనున్నారు. ఈ మూవీ తర్వాత బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో కలిసి 'F3' చేయనున్నారు వెంకటేష్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Wa8dFr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...