Monday, 7 December 2020

ఎన్నో ఏళ్ల తర్వాత ఫ్యామిలీతో ఇలా.. నిహారిక పెళ్లిలో రచ్చరచ్చే! భార్యపై బన్నీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మెగా పెళ్లి వేడుకకు ముహూర్తం దగ్గరపడింది. రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లో ఉన్న ప్యాలస్‌లో అంగరంగ వైభవంగా జరగనున్న వివాహ మహోత్సవానికి మెగా ఫ్యామిలీ అంతా హాజరు కానుంది. మెగా కాపౌండ్ యువ హీరోలతో పాటు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ కానున్నారు. డిసెంబర్ 9వ తేదీన జరగనున్న ఈ మెగా సంబరాల్లో పాల్గొనేందుకు గాను ఇప్పటికే ప్రత్యేక విమానాల్లో మెగాస్టార్ ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ ఉదయ్‌పూర్‌ చేరుకుంది. ఈ రోజు (సోమవారం) ఉదయాన్నే వరుణ్ తేజ్, నిహారికలతో నాగబాబు ఫ్యామిలీ ఉదయ్‌పూర్ చేరుకోగా.. చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, అల్లు ఫ్యామిలీ అంతా ప్రత్యేక విమానాల్లో మధ్యాహ్నం వరకు పెళ్లి వేదిక వద్దకు చేరారు. దీంతో మెగా, అల్లు ఫ్యామిలీలు ఉదయ్‌పూర్ బయల్దేరిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, తమ ఫ్యామిలీతో జాలీగా విమానంలో ప్రయాణిస్తున్న ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్న .. తన భార్య స్నేహరెడ్డిని ఉద్దేశిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. విమానంలో కూర్చొని ఉన్న స్నేహ ఫోటో షేర్ చేస్తూ 'క్యూటీ' అంటూ లవ్ సింబల్ ఎమోజీతో స్వీట్ కామెంట్ పెట్టారు బన్నీ. ఈ ప్రయాణంలో తన కూతురు, కొడుకుతో గడిపిన ఆనంద క్షణాలను పోస్ట్ చేశారు. అలాగే తన తల్లిదండ్రులు, భార్యాపిల్లలతో విమానం దిగాక దిగిన కంప్లీట్ పిక్ షేర్ చేస్తూ.. ''ఎన్నో ఏళ్ల తర్వాత ఫ్యామిలీతో విమాన ప్రయాణం.. నిహారిక, చైతన్య పెళ్లి సంబరాలు షురూ'' అని కామెంట్ చేశారు. ఈ ఫొటోల్లో బన్నీ యమ స్టైలిష్‌గా కనిపిస్తుండటమే గాక.. ఆ హుషారు చూసి మెగా వేడుకలో అల్లువారి హవా మామూలుగా ఉండకపోవచ్చు అంటున్నారు నెటిజన్లు. Also Read: గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యను నిహారిక పెళ్లాడనుంది. ఆగస్టులో జరిగిన నిశ్చితార్థం మొదలుకొని ఈ క్షణం వరకు నిహారిక- చైతన్య జోడీ ఫొటోలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. వేడుకను చూడాలని ఎంతో ఆతృతగా ఉన్నారు మెగా ఫ్యాన్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2K1NH6T
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...