Monday, 7 December 2020

జబర్దస్త్ కమెడియన్‌పై కిడ్నాప్ కేసు.. బలవంతంగా కారులో ఎక్కించుకొని! అసలేం జరిగిందంటే..

జబర్దస్త్ వేదికపై తనదైన పంచ్ డైలాగులతో ఫేమస్ అయిన కెవ్వు కార్తిక్‌పై కిడ్నాప్ కేసు నమోదుకావడం, అది కూడా ఆయన సోదరి భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడం ప్రస్తుతం జనాల్లో హాట్ టాపిక్ అయింది. కాంట్రవర్సీలతో వార్తల్లో నిలవడం జబర్దస్త్ కమెడియన్స్‌కి కొత్తేమీ కానప్పటికీ.. ఇలా ఓ కుటుంబ సభ్యుడే (సోదరి భర్త) పెట్టడం సంచలనంగా మారింది. జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్‌పై ఆయన సోదరి భర్త రవి కుమార్‌, గూడూరు పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదు చేశాడు. కార్తిక్ సహా అతని స్నేహితులు కలిసి తనపై దాడికి పాల్పడ్డారని, తనను కిడ్నాప్ చేసి దాదాపు 15 కిలో మీటర్లు దూరం కారులో తీసుకెళ్ళి కొట్టారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. రవి ఫిర్యాదు మేరకు గూడూరు పోలీసులు కార్తిక్, అతని తల్లిదండ్రులు, వెంట వచ్చిన వాళ్లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. భూపతిపేటలో తన సోదరి భర్తపై స్నేహితులతో కలిసి కార్తిక్ దాడి చేసినట్లుగా ఫిర్యాదు వచ్చిందని, దీనిపై విచారణ చేపడతామని ఎస్సై సురేశ్ నాయక్ అన్నారు. Also Read: కాగా.. కార్తిక్ సోదరిని ఆమె భర్త కొంతకాలంగా హింసిస్తున్నారని, ఆ కోణంలోనే కార్తిక్ ఆయనపై దాడి చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయమై స్పందించిన కెవ్వు కార్తిక్.. తనపై తప్పుడు అభియోగాలు మోపారని, విచారణలో వాస్తవాలు తెలుస్తాయని అన్నాడు. తనను చులకన చేయాలనే తన బావ ఈ ప్రయత్నం చేస్తున్నాడని, అందులో నిజం లేదని అన్నాడు. జబర్దస్త్ కామెడీ షోలో అవినాష్‌తో కలిసి కొన్నేళ్లుగా స్కిట్స్ చేస్తున్న కార్తిక్.. అవినాష్ బిగ్ బాస్‌కు వెళ్లిన తర్వాత సోలోగా స్కిట్స్ చేస్తున్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LgFCfp
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...