Friday, 11 December 2020

నిర్మాత చేతిలో రజినీకాంత్‌కు అవమానం.. ‘నీకు వేషం లేదు... పోరా’ అంటూ గెంటేశాడట

బస్‌ కండక్టర్‌గా జీవిత ప్రయాణాన్ని మొదలుపెట్టిన శివాజీరావ్ గైక్వాడ్ అనే యువకుడు రజినీకాంత్‌గా మారి కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అసామాన్యమైన నటనా పాటవాలతో, స్టైలిష్‌ పెర్ఫామెన్స్‌లతో వెండితెరపై సూపర్‌స్టార్‌గా ఎదిగారాయన. రజినీకి మన దేశం‌లోనే కాక జపాన్‌, మలేషియా, అమెరికా సహా అనేక దేశాల్లో కోట్లాది మంది అభిమానులున్నారు. అయితే రజినీ ఈ స్థాయికి చేరుకోవడానికి అనేక అవమానాలు, చీత్కారాలు ఎదుర్కొన్నారు. అవే తనలోని నటుడిని మరింత కసిగా పనిచేసేలా ప్రేరేపించాయని రజినీ ఓ సందర్భంలో చెప్పారు. Also Read: ‘16 వయదినిలే’ చిత్రం తర్వాత ఓ నిర్మాత నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తానని ముందుకొచ్చారు. కానీ సెట్‌కు వెళ్లేవరకూ అడ్వాన్స్‌ ఇవ్వలేదు. నేను అడ్వాన్స్‌ ఇస్తేనే నటిస్తానని తెగేసి చెప్పా. అప్పుడాయన ‘ఏరా నీకంత పొగరా. నీకు వేషం లేదు. ఇంటికి వెళ్లిపో’ అని అందరి ముందు గట్టిగా అరిచారు. ఆ సందర్భంలో నాకు చాలా బాధేసింది. ఆ కసితోనే నటుడిగా ఓ స్థాయికి ఎదగాలనుకున్నా. ఆ తర్వాత రెండేళ్లకే ఫారిన్‌ కారు కొన్నాను’ అని ఆనాటి ఘటనను గుర్తు చేసుకున్నారు రజినీ. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2W3JSB1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...