Friday, 11 December 2020

Anushka Sharma: మూడేళ్ల బంధం.. త్వరలోనే ముగ్గురం.. మిస్ యూ అంటూ అనుష్క ఎమోషనల్ పోస్ట్

సెలబ్రిటీ జోడీ విరుష్క బంధానికి నేటితో ముచ్చటగా మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తమ తమ హ్యాపీ మూమెంట్స్ షేర్ చేస్తూ వారి వారి సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెట్టారు , . మరోవైపు విరుష్క దంపతుల మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అటు సినీ లోకం, ఇటు క్రీడా లోకం పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతోంది. దీంతో ప్రస్తుతం నెట్టింట ఈ సెలబ్రిటీ జోడీ ఫోటోల హంగామా కనిపిస్తోంది. 2013 సంవత్సరంలో ఓ షాంపూ అడ్వర్టైజ్‌మెంట్ షూట్ కోసం మీట్ అయిన బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ.. నాలుగేళ్ల పాటు ప్రేమలో మునిగితేలి 2017 సంవత్సరం సరిగ్గా ఇదే రోజు (డిసెంబర్ 11) వివాహం చేసుకొని ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత కూడా ఎవరి ప్రొఫెషన్ వారు కొనసాగిస్తూనే వీలు చిక్కినప్పుడల్లా విదేశీ టూర్లు వేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా ఇటీవలే తన భార్య అనుష్క ప్రెగ్నెంట్ అని ప్రకటిస్తూ ఆనందం వ్యక్తం చేసిన విరాట్ కోహ్లీ.. తాజాగా మరో హ్యాపీ మూమెంట్ గురించి చెబుతూ ఆమెతో దిగిన మెమొరబుల్ పిక్ షేర్ చేశారు. ఆల్ ఫార్మాట్ ద్వైపాక్షిక సిరీస్ కోసం ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న విరాట్ కోహ్లీ తన మూడవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అనుష్కకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. మరోవైపు అనుష్క సైతం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా భర్త విరాట్‌ని కౌగిలించుకొని ఉన్న హ్యాపీ మూమెంట్ షేర్ చేస్తూ.. ''మూడేళ్ల బంధం.. త్వరలోనే ముగ్గురం కాబోతున్నాం.. మిస్ యూ'' అంటూ ఎమోషనల్ కామెంట్ చేశారు. దీంతో వీరిద్దరి మూడవ వివాహ వార్షికోత్సవం ఆన్‌లైన్ వేదికలపై ట్రెండింగ్‌గా మారింది. లాక్‌డౌన్ విరామ సమయంలో తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ గుడ్ న్యూస్ చెప్పి సర్‌ప్రైజ్ చేసిన విరుష్క జోడీ.. ఆ తర్వాత రెగ్యులర్‌గా అభిమానులతో టచ్‌లో ఉంటోంది. 2021 జనవరి నెలలో విరుష్క తల్లిదండ్రులుగా ప్రమోషన్ కొట్టేయబోతున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న విరాట్.. డిసెంబర్ 17న జరగనున్న మొదటి టెస్ట్ తర్వాత స్వదేశానికి తిరిగి రానున్నారు. మరోవైపు చాలాకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్న అనుష్క శర్మ.. గతేడాది చేసిన 'జీరో' మూవీ తర్వాత మరే సినిమాలో నటించలేదు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33XBPKv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...