Friday, 11 December 2020

కేరీర్ ఆరంభంలో అలా మాట్లాడిన వాళ్లే ఇప్పుడు..!! అందులోనే అసలు మజా: బిగ్ బాస్ ఫేమ్ హిమజ

కష్టం లేనిదే సుఖం దక్కదు.. అవమానం ఎదురుకానిదే అందలం ఎక్కలేం.. ఇవి అప్పుడప్పుడూ పెద్దలు చెప్పే మాటలే అయినా అక్షర సత్యాలని కొందరి జీవిత విశేషాలు తెలుసుకుంటే అర్థమవుతుంది. సినీ నటి, బిగ్ బాస్ ఫేమ్ లైఫ్‌లో కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయట. తాజాగా ఓ మీడియా సంస్థతో ముచ్చటించిన ఆమె.. తన కెరీర్ గురించిన సంగతులపై ఓపెన్ అయింది. కేరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న సవాళ్లు ఎలాంటివో చెప్పుకొచ్చింది. తెనాలి సమీపంలోని వీర్లపాలెంలో జన్మించిన హిమజ.. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చి కొన్ని రోజులపాటు ప్రైవేట్ టీచర్‌గా పనిచేసింది. ఆ తర్వాత మోడలింగ్‌పై ఉన్న మక్కువతో ఆ దిశగా అడుగులేసి బుల్లితెర అవకాశాలు దక్కించుకుంది. అలా అలా టీవీ సీరియళ్లు, రియాల్టీ షోలు చేస్తూ కాస్త పాపులారిటీ తెచ్చుకొని వెండితెరపై కూడా మెరిసింది. ''శతమానం భవతి, చిత్రలహరి, వినయ విధేయ రామ, జంబలకిడి పంబ, ఉన్నది ఒకటే జిందగీ, స్పైడర్'' లాంటి సినిమాల్లో నటించి మెప్పించిన ఆమె గత సీజన్ బిగ్ బాస్‌లో పాల్గొని ఫుల్ ఫేమస్ అయింది. Also Read: ప్రస్తుతం హిమజ ‘జ’ సినిమా చేస్తోంది. ఈ మూవీతోనే ఆమె తొలిసారి హీరోయిన్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తు చేసుకుంది హిమజ. అప్పట్లో ''మేకప్‌ వేసే ముఖం కాదు నీది.. ఎంత చెప్పినా నీలో నటన మెరుగపడదు'' అని ముఖం మీద అన్నవారే.. ఇప్పుడు ఏ క్యారక్టర్‌లో అయినా అతికినట్టు సరిపోతున్నావ్ అంటూ ప్రశంసిస్తున్నారని చెప్పింది. అలా చివాట్లు తిన్నచోటే ప్రశంసలు దక్కుతుండటం చాలా సంతోషంగా అనిపిస్తోందని పేర్కొంది. అంతేకాదు అసలు మజా అంటే నటనలోనే ఉంటుందంటూ వృత్రిపై ప్రేమను బయటపెట్టింది హిమజ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3n9b39y
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...