ఈ మధ్యకాలంలో ఏదోఒక కారణంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్న హీరోయిన్ .. తాజాగా తన పెళ్లి గురించి స్పందిస్తూ ఓపెన్ అయ్యారు. ఓ ప్రముఖ మ్యాగజైన్ కోసం ఫొటో షూట్‌లో పాల్గొన్న ఆమె.. తనకు కాబోయేవాడు ఎలా ఉండాలి, తమ పెళ్లి ఎలా జరగాలి అనే విషయాలు చెప్పుకొచ్చారు. తనకు ప్రేమ, పెళ్లిపై నమ్మకముందని, కాబోయేవాడికి జీవితం పట్ల స్పష్టత ఉండాలని పేర్కొంటూ పెళ్లిపై తన అభిప్రాయాలను బయటపెట్టారు రకుల్. తాను సంప్రదాయాలకు విలువిచ్చే కుటుంబం నుంచి వచ్చానని, నాన్న ఆర్మీ ఉద్యోగం చేశారు కాబట్టి ఆ వాతావరణంలోనే పెరిగానని చెప్పిన రకుల్.. తనకు కాబోయే భర్త కూడా ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌ని ఫాలో అయితే చాలా సంతోష పడతానని తెలిపారు. ఇక పెళ్లి వేదిక విషయానికొస్తే.. తనకు బీచ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని ఉందంటూ ఓపెన్‌గా చెప్పేశారు రకుల్. అదికూడా కేవలం అత్యంత సన్నిహితుల సమక్షంలోనే తమ వివాహం జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. Also Read: గతంలో కూడా ఇలాగే ఓ కార్యక్రమంలో తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో చెప్పారు రకుల్. తనతో జీవితం పంచుకునే వాడు కనీసం ఆరడుగులైనా ఉండాలని, అంత హైట్‌తో పాటు తెలివైన వాడై కూడా ఉండాలని చెప్పిన ఆమె.. అలాంటి క్వాలిటీస్ ఉన్న వరుడు దొరికితేనే పెళ్లి చేసుకుంటా, లేదంటే దొరికేదాకా వెయిట్ చేస్తానని అన్నారు. సో.. ఇప్పుడు మరోసారి రకుల్ పెళ్లి టాపిక్ తెచ్చిందంటే పెళ్లికి రెడీ అయ్యానని హింట్స్ ఇస్తోందా? అనే డౌట్ వస్తోంది కదూ!.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3m9c7Jl
v
No comments:
Post a Comment