Sunday, 13 December 2020

హీరో పెదాలపై ముద్దు పెట్టామన్నారు.. దర్శకుడికి ఆ మాట చెప్పగానే..! సీక్రెట్ బయటపెట్టిన సాయి పల్లవి

వెండితెరపై నాచురల్ నటనతో పక్కింటి అమ్మాయిలా తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది . ఎలాంటి గ్లామర్ డోస్ ఇవ్వకుండా కేవలం తన నటన, డాన్స్‌తోనే ప్రేక్షకుల హృదయంలో గూడు కట్టుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషా చిత్రాల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. తాజాగా తన సినిమాలకు సంబంధించిన ఓ సీక్రెట్ బయటపెట్టింది. సినిమా ఏదనేది చెప్పలేదు కానీ ఓ దర్శకుడు లిప్‌‌లాక్ సీన్ చేయమంటే తప్పించుకున్నానని తెలిపింది. కెరీర్ ఆరంభం నుంచే రొమాంటిక్ సీన్స్‌, ఎక్స్‌పోజింగ్ లాంటి వాటికి దూరంగా ఉంటూ వస్తున్న సాయి పల్లవిని ఓ దర్శకుడు హీరోతో లిప్‌‌కిస్ చేయమని అడిగారట. కథలో భాగంగా హీరో పెదాలపై ఘూటుగా ముద్దు పెట్టాలని అన్నారట. దీంతో అలాంటి సన్నివేశాలు చేయ‌డం త‌న‌కు కంఫ‌ర్ట్‌గా అనిపించ‌ద‌ని ఆ ద‌ర్శ‌కుడికి స్పాట్‌లోనే చెప్పేసిందట సాయి పల్లవి. ఆ సమయంలో మీటూ ఉద్యమ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆ సీన్ చేయమని సదరు దర్శకుడు బలవంత పెట్టలేదని, అలా 'మీటూ' కారణంగా లిప్‌లాక్‌ సీన్‌ నుండి తప్పించుకున్నానని ఆమె తెలిపింది. Also Read: ప్రస్తుతం సాయిప‌ల్ల‌వి తెలుగులో 'విరాటపర్వం' మూవీలో నటిస్తోంది. దగ్గుబాటి రానా హీరోగా రూపొందుతున్న ఈ సినిమా అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు త‌మిళంలో 'పావ‌క‌థైగ‌ల్' అనే వెబ్‌సిరీస్‌లో ఆమె న‌టించింది. నాలుగు క‌థ‌లుగా రాబోతున్న ఈ వెబ్‌సిరీస్‌ ఒక కథలో సాయి పల్లవి కనిపించనుంది. డిసెంబర్ 18న విడుదల కానున్న ఈ వెబ్ సిరీస్‌లో ప్రకాష్ ‌రాజ్ కీలకపాత్రలో నటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KlEu9E
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...