Sunday, 13 December 2020

HBD Venkatesh: వెంకటేష్ బర్త్ డే కానుకగా F3 అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. ఫస్ట్‌లుక్ రిలీజ్

నేడు (డిసెంబర్ 13) విక్టరీ బర్త్ డే కానుకగా ఆయన తదుపరి సినిమా F3ని అఫీషియల్‌గా అనౌన్స్‌ చేశారు. వెంకటేష్, , తమన్నా, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా 2019 సంక్రాంతికి విడుదలైన సంచలన విజయం సాధించిన F2 సినిమాకు సీక్వల్‌గా ఈ మూవీ రూపొందించనున్నారు. చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించబోతున్నారు. గత కొన్నిరోజులుగా ఈ మూవీ గురించిన చర్చలు నడుస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్, కాన్సెప్ట్‌ వీడియో రిలీజ్ చేసి ఆసక్తి రేకెత్తించారు మేకర్స్. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో వెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరూ చెరో ట్రాలీలో డబ్బుల కట్టలు వేసుకొని కదులుతున్నట్లు కనిపిస్తుండటం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ''ఇష్యూ డబ్బులు అయినప్పుడు మరి ఫన్ పీక్స్ లోనే ఉంటుందిగా.. అంతేగా అంతేగా..'' అంటూ ఈ పోస్టర్ పంచుకున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. అంతేకాదు F2ని మించి F3లో ఫన్ మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ సినిమాలో కూడా తమన్నా, మెహ్రీన్ నటించబోతున్నారట. అలాగే వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో పాటు మరో హీరోకి అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే ఆయనెవరో అధికారికంగా ప్రకటించనున్నారని టాక్. Also Read: మోర్ ఫన్ బిగిన్స్ అంటూ ఈ సందర్భంగా.. 'నవ్వుల వ్యాక్సిన్‌తో మీ ముందుకు వచ్చేస్తున్నాం' అని వెంకీ వాయిస్‌లో 'నవ్వుకోవడాకి మీరు కూడా థియేటర్స్‌కు వస్తారుగా' అని వరుణ్‌తేజ్‌ వాయిస్‌లో డైలాగ్స్‌తో పాటు F2లో పాపులర్‌ అయిన 'అంతేగా ..అంతేగా' అనే డైలాగ్‌తో ఉన్న కాన్సెప్ట్‌ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో నెట్టింట మరింత ఆకర్షణీయంగా మారింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3n9Dh3X
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...