Saturday, 12 December 2020

బుల్లితెరపై మరోసారి జూనియర్ ఎన్టీఆర్ గ్రాండ్ ఎంట్రీ.. పక్కా ప్లాన్!! కళ్లు చెదిరే రెమ్మ్యూనరేషన్

వెండితెరపై సత్తా చాటుతూ అదే స్థాయిలో బులితెరపై ఆదరణ పొందే హీరోలు కొందరే ఉంటారు. అందులో ఒకరే నందమూరి వారసుడు, యంగ్ టైగర్ . తెలుగు తెరపై తనదైన నటనతో భారీ పాపులారిటీ కూడగట్టుకున్న ఆయన బిగ్ బాస్ సీజన్- 1తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి విమర్శకుల ప్రశంసలందుకున్నారు. అయితే పలు కారణాల వల్ల ఆ తర్వాత నడుస్తున్న బిగ్ బాస్ సీజన్లలో కనిపించని ఎన్టీఆర్.. తాజాగా బుల్లితెరపై ప్రసారం కానున్న మరో పాపులర్ షోకి హోస్ట్‌గా చేసేందుకు అంగీకరించారని తెలుస్తోంది. ఇందుకు గాను ఆయనకు భారీ ఆఫర్ ఇచ్చారట. బుల్లితెరపై బిగ్ బాస్ ఎంతలా అయితే పాపులర్ అయిందో అదే రేంజ్‌లో దూసుకుపోతున్న మరో షో 'కౌన్ బనేగా కరోడ్ పతి'. తెలుగులో '' పేరుతో ఈ షో ప్రసారం అయింది కానీ.. హిందీలో వచ్చిన టీఆర్ఫీ తెలుగులో రాబట్టలేక పోయింది. ఇప్పటికే స్టార్ హీరోలు నాగార్జున, చిరంజీవిలు ఈ షో హోస్ట్ చేసినా అనుకున్న ఫలితం రాలేదట. దీంతో ఈ సారి పక్కాగా ప్లాన్ చేసి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని రంగంలోకి దించుతున్నారని సమాచారం. Also Read: అదేవిధంగా ఈ సారి స్టార్ మా ఛానల్‌లో కాకుండా జెమినీ టీవీలో ఈ 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో ప్రసారం కానుందట. ఈ మేరకు 'మీలో ఎవరు కోటీశ్వరుడు' టైటిల్‌తో పాటు షోలో కొన్ని మార్పులు చేర్పులు చేసిందట జెమినీ యాజమాన్యం. అదేవిధంగా ఈ షో హోస్ట్ చేసినందుకు గాను ఎన్టీఆర్‌ని ఒప్పించడంలో విశ్వ ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారని టాక్. అంతేకాదు ఇప్పటిదాకా టెలివిజన్ చరిత్రలో లేని విధంగా ఎన్టీఆర్‌కి కళ్లు చెదిరే రెమ్మ్యూనరేషన్ ఆఫర్ చేశారని తెలుస్తోంది. ఈ న్యూస్ నిజమో కాదో క్లారిటీ రాకముందే నందమూరి ఫ్యాన్స్‌ హుషారెత్తిపోతుండటం విశేషం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Kg9h7V
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...