Saturday, 12 December 2020

ప్రతి భారతీయుడు గర్వపడే మూవీ 'మైదాన్'.. ఆట, పాట అన్నీ అప్పుడే అంటున్న బోనీ కపూర్

భారత ఫుట్‌బాల్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘’. స్టార్ హీరో లీడ్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి బధాయి హో వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఫుట్‌బాల్‌కి స్వ‌ర్ణ‌యుగ‌మైన 1952-62 మ‌ధ్య కాలానికి సంబంధించిన క‌థ‌తో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్. వచ్చే ఏడాది దస‌రా కానుకగా 2021 అక్టోబ‌ర్15వ తేదీన హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ‘మైదాన్’ విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇప్ప‌టికే చిత్ర బృందం విడుదల చేసిన మైదాన్ పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. నిజ జీవితంలో అయినా, ఆటలో అయినా.. ఆత్మ విశ్వాసం, కష్టపడే తత్వంతో పాటు ఎన్నో త్యాగాలు చేస్తేనే విజయం వరిస్తుంది అనే పాయింట్‌ని హైలెట్ చేస్తూ ఈ ‘మైదాన్’ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. Also Read: నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి, బధాయి హో ఫేమ్ గజరాజ్ రావు, పాపులర్ బెంగాలీ యాక్టర్ రుద్రనిల్ ఘోష్ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్న ఈ మైదాన్ సినిమాను ఫ్రెష్‌లైమ్ ఫిల్మ్‌ సహకారంతో జీ స్టూడియోస్ బేన‌ర్‌పై బోనీ కపూర్, ఆకాష్ చావ్లా, అరునవ జాయ్ సేన్ గుప్తా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ తెర‌పై చూడ‌ని ఒక స్పూర్తివంత‌మైన క‌థ‌తో ప్రతి భారతీయుడు గర్వపడేలా ఈ మూవీ ఉంటుందని నిర్మాత బోనీ కపూర్ చెప్పారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3a4h6Zh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...