డిసెంబర్ 9వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ ప్యాలస్‌లో అంగరంగ వైభవంగా మెగా డాటర్ వేడుక జరిగిన సంగతి తెలిసిందే. ఈ గ్రాండ్ ఈవెంట్‌లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా మెగా కాంపౌండ్ హీరోలంతా తెగ సందడి చేయడంతో ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత డిసెంబర్ 11వ తేదీన హైదరాబాద్‌లో రెసెప్షన్ జరిగింది. అయితే నేటితో పెళ్లి హడావిడి ముగించుకున్న నిహారిక జోడీ.. వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. నేడు (డిసెంబర్ 12) నవ దంపతులు నిహారిక- చైతన్య జోడీ అన్నవరం వెళ్లారు. అక్కడి ఆలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించడంతో పాటు కొన్ని ప్రత్యేక పూజలు చేయించారు. ఈ పూజా కార్యక్రమంలో నిహారిక, ఆమె భర్త చైతన్యతో పాటు అత్తా మామలు కూడా కనిపించారు. కేవలం చైతన్య కుటుంబం మాత్రమే ఈ పూజల్లో పాల్గొనడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Also Read: నిహారిక- చైతన్య జోడీ వచ్చిందని తెలిసి మీడియా వర్గాలు అక్కడికి చేరుకొని హడావిడి చేయగా.. ఆలయ ప్రాంగణమంతా అభిమానుల కోలాహలం కనిపించింది. పూజా కార్యక్రమాల అనంతరం గుడి నుంచి బయటికి వచ్చి అందరినీ పలకరించారు నవ దంపతులు. దీంతో అన్నవరం ఆలయంలో సందడి నెలకొంది. పూజా కార్యక్రమాల అనంతరం నిహారిక జోడీ తిరిగి హైదరాబాద్ చేరుకుందని సమాచారం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37UBKbv
v
No comments:
Post a Comment