Wednesday, 23 December 2020

ప్రభాస్ బిగ్ మూవీ 'సలార్'లో ఛాన్స్ పట్టేసిన హాట్ బ్యూటీ.. హీరోయిన్ ఫిక్స్!

బాహుబలి సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యంగ్ రెబల్ స్టార్ వరుస సినిమాలతో బిజీ అయ్యారు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో నాగ్ అశ్విన్, `ఆదిపురుష్` సినిమాలను లైన్‌లో పెట్టేశారు. దీంతో పాటు ఇటీవలే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో భారీ మూవీని ఓకే చేశారు. ఈ సినిమాకు '' అనే టైటిల్ ప్రకటిస్తూ రెబల్ స్టార్ అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది టీమ్. దీంతో ఒక్కసారిగా ఈ మూవీ చర్చల్లో నిలిచింది. ఈ క్రమంలో ఈ సినిమాలో మరో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్నట్లు టాక్ వచ్చింది. మరో ఇద్దరు స్టార్ హీరోలు దగ్గుబాటి రానా, మోహన్‌లాల్ నటించనున్నట్లు వార్తలు వినిపించాయి. ఇకపోతే తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రభాస్ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ భామను తీసుకోవాలని అనుకున్న ప్రశాంత్ నీల్ బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానిని కన్ఫర్మ్ చేశారని సమాచారం. ఇదే జరిగితే దిశా పటానీకి ఇది బెస్ట్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hbcMsA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...