Wednesday, 23 December 2020

Sai Dharam Tej: సోలో బ్రతుకే సో బెటర్.. మెగా మేనల్లుడికి చిరంజీవి సపోర్ట్

మెగా మేనల్లుడు , నభా నటేష్‌ జంటగా నటించిన కొత్త చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’. డిసెంబర్ 25వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ తర్వాత విడుదలవుతున్న మొదటి చిత్రం ఇదే కావడంతో అందరి దృష్టి ఇదే సినిమాపై పడింది. ఈ నేపథ్యంలో తాజాగా మెగా మేనల్లుడికి సపోర్ట్ చేస్తూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. ''ఈ క్రిస్మస్‌కి విడుదల కాబోతున్న '' సినిమా యూనిట్ మొత్తానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నా. లాక్ డౌన్ తర్వాత విడుదలవుతున్న తొలి చిత్రంగా ఇది ఫిలిం ఇండస్ట్రీకే ఓ ముఖ్యమైన సందర్భం. ఈ చిత్రానికి లభించే ఆదరణ మొత్తం చిత్ర పరిశ్రమలోనే ఒక స్ఫూర్తిని, స్థైర్యాన్ని కలిగిస్తోందనడంలో సందేహం లేదు. అలాగే ప్రేక్షకులందరూ బాధ్యతగా పేస్ మాస్క్‌లు ధరించి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాను'' అని పేర్కొన్నారు చిరంజీవి. నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో ఈ 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా రూపొందింది. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై రూపొందిన ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్‌గా నటించింది. లాక్‌డౌన్, థియేటర్స్ రీ ఓపెన్ తర్వాత అత్యధిక సెంటర్లలో రిలీజ్ కాబోతున్న మూవీ ఇదే కావడం విశేషం. ఇప్పటికే విడుదలైన అన్ని అప్‌డేట్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37KZgcl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...