Tuesday, 22 December 2020

రామ్ లోపాల్ వర్మ బంపర్ ఆఫర్.. ఉచితంగానే చూసేయ్యండి.. రంగంలోకి జబర్దస్త్ కమెడియన్

లాక్‌డౌన్ వేళ ఓటీటీ వేదికలపై పలు సినిమాలు రిలీజ్ చేసి.. పే పర్ వ్యూ మెథడ్‌లో దానికి టికెట్ వసూలు చేసి లాభాలు గడించారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అయితే ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా '' అనే సినిమాను ఉచితంగా ప్రసారం చేయబోతోంది ఊర్వశి ఓటీటీ వేదిక. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు వినోదాల విందిచ్చేందుకు 'ఊర్వశి ఓటీటీ' రాబోతోంది. అయితే 'ఇనాగురల్ ఆఫర్'గా ఉచిత వినోదం పంచేందుకు రెడీ అయింది ఈ ఓటీటీ మేనేజ్‌మెంట్. రామ్ లోపాల్ వర్మ చిత్రాన్ని ఉచితంగా చూపించనుంది 'ఊర్వశి ఓటీటీ'. ప్రముఖ దర్శకుడు వీరు.కె రూపొందించిన ఈ చిత్రంలో , ఆర్లిన్, డి.ఎస్.రావు, మధురిమ, లక్కీ, ఫిష్ వెంకట్, శశికాంత్, హర్షద పటేల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వీరు.కె మాట్లాడుతూ.. "ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమవుతున్న 'ఊర్వశి ఓటిటి' ఇనాగురల్ ఆఫర్‌గా 'రామ్ లోపాల్ వర్మ' స్ట్రీమింగ్ కానుండడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకువెళ్లిన దర్శకుడు ఇప్పుడు.. అదే తెలుగు సినిమా స్థాయి పాతాళంలోకి తీసుకువెళ్తుండడాన్ని జీర్ణించుకోలేక సదరు దర్శకుడిపై ఇప్పటికీ గల గౌరవంతో, ఆవేదనతో, అతని లోపాలను ఎత్తి చూపుతూనే అతని పూర్వ వైభవాన్ని కోరుకుంటూ రూపొందించిన చిత్రం 'రామ్ లోపాల్ వర్మ'. వినోదానికి పెద్ద పీట వేస్తూనే విమర్శనాత్మకంగా, ఆలోచనలు రేకెత్తించేలా తెరకెక్కిన ఈ మూవీ అందరినీ కచ్చితంగా ఆకట్టుకుంటుంది" అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rhQHgF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...