Tuesday, 22 December 2020

నా జీవితంలో మర్చిపోలేని సందర్బం.. చిరంజీవి దంపతులు పంపిన బిర్యానీ తింటూ సోహైల్ ఎమోషనల్ కామెంట్స్

బిగ్ బాస్ సీజన్ 4 కంటిస్టెంట్‌గా ఫైనల్ దాకా చేరుకొని మూడో స్థానంలో నిలిచిన సయ్యద్ సోహైల్.. గ్రాండ్ ఫినాలేలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. 25 లక్షల ప్రైజ్ మనీ తీసుకొని ఎంతో ఆనందంగా హౌస్ నుంచి బయటకొచ్చిన తన అభిమానులు, స్నేహితుల కేరింతల నడుమ ఇంటికి చేరుకున్నాడు. సోహైల్‌తో పాటు అలీ రెజా, మెహబూబ్ దిల్ సే, రామారావు అంతా కలిసి పార్టీ చేసుకున్నారు. అయితే ఈ పార్టీలో చిరంజీవి సతీమణి సురేఖ పంపించిన బిర్యానీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ బిర్యానీ తింటూ ఫుల్ ఖుషీ అయ్యాడు సోహైల్. చిరంజీవి తనకు అన్నయ్య అని, సురేఖ వదిన అని చెబుతూ పొంగిపోయిన సోహైల్.. తన ఇష్టాన్ని గుర్తించి తన కోసం సురేఖ వదిన మటన్, చికెన్ బిర్యానీ చేసి పంపించడం ఈ జీవితంలో మరచిపోలేనని అన్నాడు. అన్నయ్య, వదిన మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. తన తండ్రితో పాటు అలీ రెజా, మెహబూబ్ లతో కలిసి ఆ బిర్యానీ తింటూ ఎంజాయ్ చేశాడు సోహైల్. చికెన్, మటన్.. కిర్రాక్ ఉన్నాయి అంటూ తెగ సంబరపడిపోయారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Also Read: ఇక బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ గురించి మాట్లాడిన సోహైల్.. అభి‌ చాలా కూల్ పర్సన్ అని చెప్పాడు. అతను తన బెస్ట్ ఫ్రెండ్ అని తన గేమ్ తాను ఆడుతూ ఎంజాయ్ చేస్తుంటాడని చెప్పాడు. యాక్సిడెంట్ కారణంగా అభికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఫిజికల్ టాస్కులు ఆడలేదని, విజేతగా నిలిచిన ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నా అని చెప్పాడు. బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్‌గా అభిజీత్, రన్నర్‌గా అఖిల్ నిలవగా.. మూడో స్థానంలో సోహైల్ నిలిచాడు. ఈ మేరకు సోహైల్ 25 లక్షల ప్రైజ్ మనీతో పాటు నాగార్జున నుంచి మరో 10 లక్షలు, చిరంజీవి నుంచి మెహబూబ్‌కి మరో 10 లక్షల ఇవ్వడానికి కారణం అయ్యాడు. మొత్తంగా చూస్తే 45 లక్షలు అందుకున్నాడు సోహైల్. అంతేకాదు తాను రూపొందించబోయే సినిమాలో చిరంజీవిని భాగం చేసుకునే లక్కీ ఛాన్స్ కూడా కొట్టేశాడు సోహైల్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LZCdC5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...