మెగా వారింట పెళ్లి కోలాహలం మొదలైంది. మెగా బ్రదర్ నాగబాబు కూతురు పెళ్లి పీటలెక్కే సమయం దగ్గర పడుతుండటంతో సంబరాలు షురూ చేసింది మెగా ఫ్యామిలీ. ఇప్పటికే కుటుంబం అంతా ఒక్కచోట చేరి ప్రీ వెడ్డింగ్ వేడుకను ఎంజాయ్ చేస్తున్నారు. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, శ్రీజ, సుస్మిత, అల్లు వారబ్బాయిలు ఇలా మెగా కాంపౌండ్ మొత్తం ఒక్కటి కావడంతో నాగబాబు ఇంట్లో కోలాహలం కనిపిస్తోంది. మరోవైపు పెళ్లి కూతురుగా ముస్తాబవుతున్న .. ఎప్పటికప్పుడు తన ప్రీ వెడ్డింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె చేసిన ఓ పిక్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ ఫోటోలో ఇద్దరు మహిళలు ఆమె కాళ్లపై పడినట్లు కనిపిస్తుండటంతో అంతా షాక్ అయ్యారు. అయితే ఈ పరిణామాన్ని ముందుగానే ఊహించిన మెగా డాటర్.. దానిపై క్లారిటీ ఇస్తూ ఓ కామెంట్ ట్యాగ్ చేసింది. ''చెప్తున్నా.. చెప్తున్నా.. వాళ్లిద్దరూ నా హీల్స్ సరి చేస్తున్నారు. నా దుస్తులు, మేకప్ విషయంలో ఆ ఇద్దరూ సహాయకురాలిగా లేకపోతే చాలా ఇబ్బంది పడేదాన్ని. లవ్ యూ గర్ల్స్'' అని పేర్కొంది నిహారిక. దీంతో పెళ్లి కూతురుగా ముస్తాబైన నిహారిక యాక్టివ్‌నెస్ చూసి మురిసిపోతున్నారు మెగా ఫ్యాన్స్. Also Read: గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కొడుకు చైతన్యతో డిసెంబర్ 9వ తేదీన రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో నిహారిక పెళ్లి వేడుక జరగనుంది. ఇప్పటికే అక్కడ పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తిచేసినట్లు సమాచారం. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ పెళ్లి వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా హాజరు కానున్నారు. ఆ శుభ గడియ కోసం మెగా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ggmN7C
v
No comments:
Post a Comment