Friday, 4 December 2020

‘జనతా గ్యారేజీ’లో బాలయ్యను అందుకే తీసుకోలేదట!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో 2016లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ‘ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును’ అన్న ట్యాగ్‌లైన్‌తో ఓ వైపు పాడైన వాహనాలను, మరోవైపు అన్యాయం చేసే వ్యక్తుల్ని కథానాయకుడు దారిలో పెడుతుంటాడు. ప్రకృతి ప్రేమికుడిగా, తప్పుచేసే వాళ్లని ఎదిరించే యువకుడిగా ఆనంద్ పాత్రలో ఒదిగిపోయాడు. ఇందులో ఆయన చెప్పిన డైలాగులు, స్టెప్పులు ఓ ఊపు ఊపాయి. ఈ చిత్రానికి మరో అదనపు ఎట్రాక్షన్‌గా నిలిచారు మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్. మెకానిక్‌ సత్యం పాత్రలో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారాయన. అయితే సత్యం పాత్రలో నటిస్తే ఎలా ఉండేదో ఊహించుకోండి. పైగా బాబాయ్, అబ్బాయ్ ఒకే సినిమాలో కనిపిస్తే నందమూరి అభిమానులకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది. ఈ నేపథ్యంలోనే‘’ సినిమాలో బాలకృష్ణ నటిస్తున్నారంటూ అప్పట్లో జోరుగా వార్తలు రావడంతో నందమూరి ఫ్యాన్స్‌ ఖుషీ అయిపోయారు. చివరికి ఆ పాత్రకు మోహన్‌లాల్‌‌ని సెలక్ట్ చేశారు దర్శకుడు కొరటాల శివ. Also Read: దీనిపై గతంలో సోషల్‌మీడియా ద్వారా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు కొరటాల శివ ఇలా సమాధానమిచ్చారు. ‘తారక్, బాలయ్య కలయికలో సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఈ కాంబినేషన్లో వచ్చే సినిమాలో వాళ్లిద్దరి మధ్య సన్నివేశాలు ఎలా ఉంటాయో అని ఎదురు చూస్తారు తప్ప కథని ఎవరూ పట్టించుకోరు. జనతా గ్యారేజ్ మంచి కథా బలం ఉన్న సినిమా. ఆ పాత్రకు బాలయ్య అంతగా సూటవ్వరని అనిపించే ఆయన్ని సంప్రదించలేదు. భవిష్యత్తులో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రావొచ్చేమో’ అని చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2IgfpfW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...