Tuesday, 8 December 2020

‘అల్లరి ప్రియుడు’లో రాజశేఖర్‌కు ఛాన్స్ అలా వచ్చిందట.. ఆ హీరో తప్పుకున్నాడు

యాంగ్రీ యంగ్‌మెన్‌గా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న రాజశేఖర్ పోలీసు పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. వరుస ఫ్లాపులతో ఆయన పని అయిపోయిందనుకున్న ప్రతిసారి బ్లాక్‌బస్టర్‌తో మళ్లీ ఫామ్‌లోకి రావడం ఆయన ప్రత్యేకత. అయితే రాజశేఖర్‌ కేవలం పోలీసు వేషాలే కాకుండా విభిన్న పాత్రలు పోషిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన కెరీర్లో ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలు ఉన్నప్పటికీ ‘’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాజశేఖర్‌ను యువతకు, మహిళలకు బాగా దగ్గర చేసిన చేసిందీ ఈ సినిమా. కె.రాఘవేంద్రరావు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ అద్భుతమైన ప్రేమకథ అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఎం.ఎం. కీరవాణి సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ‘ఎప్పుడూ సీరియస్ పాత్రలు చేసే రాజశేఖర్ లవ్ స్టోరీలకు సెట్ అవుతాడా’ అనే నెగిటివ్ కామెంట్స్ కూడా అప్పట్లో చాలా వినిపించాయట. ఆ విమర్శలన్నింటినీ పటాపంచలు చేస్తూ రాజశేఖర్ ఆ పాత్రకు తాను మాత్రమే ఛాయిస్ అన్నట్లుగా నిరూపించారు. అయితే ఈ సూపర్‌ హిట్ సినిమా రాజశేఖర్ ఫస్ట్ ఛాయిస్ కాదట. అప్పట్లో యాక్షన్, ఫ్యామిలీ హీరోగా మంచి ఫామ్‌లో ఉన్న సుమన్‌ను ఇందులో హీరోగా తీసుకోవాలని దర్శకుడు కె.రాఘవేంద్రరావు అనుకున్నారు. ఆ సమయంలో సుమన్ కొన్ని సమస్యల్లో చిక్కుకోవడంతో ఈ ప్రాజెక్ట్‌కి దూరమయ్యారట. దీంతో ఈ లక్కీ ఛాన్స్ రాజశేఖర్‌ను వరించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37KpTNa
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...