Tuesday, 8 December 2020

‘పెళ్లి సందడి’లో శ్రీకాంత్... కొడుకుతో కలిసి తొలిసారి

దర్శకేంద్రుడు దర్శకత్వంలో వచ్చిన ‘’ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్పటివరకు చిన్నచిన్న వేషాల్లో కనిపించిన శ్రీకాంత్‌తో పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. కీరవాణి సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు అదే క్లాసిక్ టైటిల్‌తో కొడుకు రోషన్ హీరోగా రాఘవేంద్రరావు ఓ సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో ఈ చిత్రాన్ని నూతన దర్శకురాలు గౌరి రోనక్‌ తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు సంబంధించి పనులు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో శ్రీకాంత్ నటించనున్నట్లు తెలుస్తోంది. కథను మలుపు తిప్పే కీలక పాత్రలో ఆయన కనిపించబోతున్నారట. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముంది. ప్రస్తుతం యూనిట్ హీరోయిన్ కోసం వెతుకుతోంది. ఈ సినిమా షూటింగ్ జనవరి నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2K2LYhZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...