Wednesday, 9 December 2020

ఆలియా ఖర్చు రోజుకి రూ.లక్ష.. నిర్మాతకు చుక్కలు చూపుతున్న బ్యూటీ

బాలీవుడ్ నటి ‘’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. రామ్‌చరణ్‌కు జోడీగా సీత పాత్రలో ఆమె కనిపించనుంది. రెండ్రోజుల క్రితమే ముంబయి నుంచి హైదరాబాద్ చేరుకున్న ఈ బ్యూటీ ఆర్ఆర్ఆర్‌ టీమ్‌తో జతకలిసింది. ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను సుమారు రూ.450కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. Also Read: అసలే భారీ బడ్జెట్ మూవీ కావడంతో టెన్షన్లో ఉన్న నిర్మాతకు ఆలియా వ్యవహారం మరింత తలనొప్పిగా మారిందట. పది మంది వ్యక్తిగత సిబ్బందితో హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ఆలియాకు అన్ని సౌకర్యాలు నిర్మాతే సమకూర్చాల్సి ఉంది. ఆలియాతో పాటు న‌లుగురు బౌన్సర్లు, ఓ మేక‌ప్ ఆర్టిస్ట్‌, పీఏ, హెయిర్ స్టైలిష్ట్‌, కాస్ట్యూమ్ డిజైన‌ర్, మేనేజ‌ర్‌, పర్సనల్ డ్రైవ‌ర్‌‌కు హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. వీరందరికీ కలిసి రోజుకి సుమారు రూ.లక్షకి పైగా ఖర్చు అవుతోంది. దీంతో ఆమెకిచ్చే భారీ రెమ్యునరేషన్‌కి తోడు ఇంత ఖర్చు పెట్టాల్సి వస్తుందని ఆర్ఆర్ఆర్ మేకర్స్ ఆవేదన చెందుతున్నారట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gukspr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...