Monday, 2 November 2020

Surekha Vani: చేతిలో గ్లాసు, పక్కనే సముద్రం.. కూతురితో కలిసి గోవాలో సురేఖావాణి రచ్చ!!

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అక్కగా, వదినగా, అమ్మగా పలు వేషాలు వేసి వెండితెరపై అలరించిన ఆమె నిత్యం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ భారీ పాపులారిటీ కూడగట్టుకుంటోంది. సినిమా అవకాశాల సంగతెలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ హంగామా చేస్తోంది. కూతురు సుప్రితను వెంటబెట్టుకొని సరదాగా దేశాన్ని చుట్టేస్తూ ఆయా ఫొటోలతో నెట్టింట రచ్చ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె షేర్ చేసిన ఓ పిక్ వైరల్‌గా మారింది. రొటీన్‌కి బిన్నంగా గ్లామర్ ఫోటోలకు ట్రెడిషినల్ లుక్‌ జోడిస్తూ నెటిజన్ల చూపు తనవైపు తిప్పుకోవడం సురేఖావాణి నైజం. గతంలో సురేఖావాణి, ఆమె కూతురు కలిసి చేసిన డాన్స్ వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. అప్పటినుంచి రెగ్యులర్‌గా తమ తమ అప్‌డేట్స్ పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటున్న సురేఖా.. తాజాగా తన కూతురుతో దిగిన ఓ ఫొటో షేర్ చేస్తూ 'ఎప్పటికీ నా బెస్ట్' అంటూ కామెంట్ చేసింది. ఈ ఫొటోలో సురేఖావాణి, ఆమె కూతురు సుప్రిత ఇద్దరూ మోడ్రన్ డ్రెసుల్లో యమ అట్రాక్ట్ చేస్తూ కనిపిస్తున్నారు. ఇక సురేఖ చేతిలో ఉన్న డ్రింక్ గ్లాస్, వెనకాలే సముద్రం చూస్తుంటే ఈ తల్లీ కూతుళ్లిద్దరూ బీచ్ ఒడ్డున చిల్ అవుతున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. గత నెలలో షూటింగ్ నిమిత్తం రాజస్తాన్, జైపూర్‌లో సందడి చేసిన వీళ్ళు రీసెంట్‌గా గోవా షికారుకు వెళ్లారట. ప్రస్తుతం అక్కడే సరదాగా ఎంజాయ్ చేస్తున్నారని, ఈ ఫొటో అక్కడిదే అని సమాచారం. Also Read: భర్త సురేష్ తేజ చనిపోయిన తరువాత ఆ బాధను దిగమింగుతూనే కూతురుతో సరదాగా గడుపుతోంది సురేఖావాణి. కాకపోతే హాట్‌నెస్ విషయంలో వెనక్కితగ్గకుండా తనకు నచ్చినట్లుగానే ఉంటోంది. అయితే కూతురు సుప్రితకు సినిమా అవకాశాలు తెచ్చిపెట్టేందుకే ఆమెను ఎక్కువగా ఫోకస్ చేస్తోందనే టాక్ జనాల్లో మొదలైంది. సుప్రిత సినిమాల్లోకి వస్తానంటే తనకెలాంటి అభ్యంతరం లేదని గతంలోనే కన్ఫర్మ్ చేసింది సురేఖావాణి .


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mNhfTQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...