Thursday, 5 November 2020

Samantha Akkineni: సత్తా చాటిన సమంత.. ఈ రేటింగ్ చూస్తే విమర్శకులు నోరెళ్లబెట్టాల్సిందే!

ఇటీవలే బుల్లితెర పాపులర్ షో బిగ్ బాస్ తెరపై అక్కినేని కోడలు పిల్ల సందడి చేసిన సంగతి తెలిసిందే. దసరా పండగ స్పెషల్ ఎపిసోడ్‌లో చిన్నితెరపై తనదైన స్టైల్‌లో మ్యాజిక్ చేస్తూ మామ నాగార్జున లేని లోటును భర్తీ చేసింది. ఈ ఎపిసోడ్ భారీ ఆదరణ కూడగట్టుకుంది కానీ అయితే కొందరు సమంతను, బిగ్ బాస్ ప్రోగ్రాంను ట్రోల్ చేశారు. ఈ ఎపిసోడ్ అనుకున్నంతగా ఆకర్షించలేదని పేర్కొంటూ విమర్శించారు. అయితే తాజాగా ఆ ఎపిసోడ్ తాలూకు టీవీ రేటింగ్ బయటకురావడంతో సదరు విమర్శకుల నోటికి తాళం పడింది. సమంత ఎపిసోడ్‌కి తక్కువ రేటింగ్ వచ్చిందని తప్పుడు ప్రచారాలు పుట్టించడమే గాక, బిగ్ బాస్ షో అనేది అక్కినేని ఫ్యామిలీ షోగా మారిందని విమర్శలు గుప్పించారు కొందరు నెటిజన్లు. ఇంకొందరైతే సమంత హోస్టింగ్ పరమ చెత్తగా ఉందంటూ రెచ్చిపోయారు. కానీ తాజాగా వచ్చిన రేటింగ్ ప్రకారంగా చూస్తే.. ఆ ఎపిసోడ్‌లో సమంత సత్తా చాటిందని స్పష్టంగా తెలుస్తోంది. దసరా రోజు టెలికాస్ట్ అయిన బిగ్ బాస్ 4కు 11.4 టీవి రేటింగ్ వచ్చిందని అఫీషియల్ సమాచారం బయటకొచ్చింది. దీంతో ఇది చుసిన సామ్ అభిమానులు తమ అభిమాన తారను అంతలా విమర్శించిన వారంతా నోరెళ్లబెట్టాల్సిందే.. ఇదీ సమంత సత్తా! అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రేటింగ్‌ని బట్టిచూస్తే సమంత చేసింది ఒక్క ఎపిసోడే, పైగా హోస్ట్‌గా కొత్తే అయినా మామ నాగార్జున అంచనాలు అందుకొని న్యాయం చేసిందని తెలుస్తోంది. అయితే ఆ తర్వాత మరో రెండు వారాలు కూడా బిగ్ బాస్ హోస్ట్‌గా సమంతనే చేస్తుందని భావించిన ఆమె అభిమానులకు నిరాశే ఎదురైంది. కేవలం దసరా ఎపిసోడ్ మాత్రమే చేసి ఆమె నిష్క్రమించింది. దీంతో వైల్డ్ డాగ్ షూటింగ్ నిమిత్తం మనాలి వెళ్లిన నాగార్జున.. ప్రతి వారాంతంలో హైదరాబాద్ వచ్చి బిగ్ బాస్ షూటింగ్ ఫినిష్ చేసుకొని వెళ్తున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32eE5vP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...