Thursday, 5 November 2020

మధ్యలోనే ఆగిపోయిన చిరు-ఆర్జీవీ సినిమా... కారణమేంటో తెలుసా?

మెగాస్టార్ , వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కాంబినేషన్లో సినిమా వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇది ఇప్పటి ఆలోచన కాదు సుమారు 20ఏళ్ల క్రితమే ఆర్జీవీ ఈ ప్రాజెక్టు పట్టాలెక్కించేందుకు ప్రయత్నించాడు. చిరుతో సినిమా చేసేందుకు ఓ కథను సిద్ధం చేశాడు. అశ్వనీదత్ నిర్మాతగా, చిరంజీవి, టబు జంటగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. సినిమా పేరు ‘వినాలని ఉంది’. దాదాపు 20శాతం షూటింగ్ పూర్తయ్యాక చిరుకు స్క్రిప్టుపై సందేహం వచ్చి కొంతమేర మార్చాలని వర్మను కోరారట. Also Read: అయితే తాను అనుకున్నది చేయడమే తప్ప.. ఎవరిమాట వినడం ఆర్జీవీకి చేతకాదని అందరికీ తెలిసిందే. దీంతో చిరు చెప్పిన మార్పులు చేసేందుకు వర్మ అంగీకరించకపోవడంతో ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అప్పట్లో ఈ సినిమా గురించి రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రేజీ ప్రాజెక్టు ఆగిపోవడంతో దాని కోసం స్వరపరిచిన పాటలను దర్శకుడు గుణశేఖర్, చిరుతో తెరకెక్కించిన ‘చూడాలని ఉంది’ సినిమాలో వాడుకున్నారు. అప్పటి నుంచి మళ్లీ ఆర్జీవీ-చిరు కాంబినేషన్లో ఏ చిత్రమూ రాలేదు. ప్రస్తుతం వర్మ పరిస్థితి చూస్తుంటే ఆయనతో సినిమాలు చేసేందుకు తెలుగు టాప్ హీరోలు ధైర్యం చేస్తారా? అన్నది సందేహమే. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3l3BIDM
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...