Thursday, 5 November 2020

‘చైకి విడాకులిచ్చేయ్.. మనం పెళ్లి చేసుకుందాం’.. నెటిజన్‌‌కు సమంత షాకింగ్ సమాధానం

టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ లిస్టులో అక్కినేని , ఒకరు. పెళ్లయిన తర్వాత కూడా వీరిద్దరు సినిమాలతో బిజీగా ఉన్నారు. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సమంత ఎప్పుడూ సోషల్‌మీడియా ద్వారా అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు తాజా ఫోటోలు పోస్ట్ చేయడంతో పాటు నెటిజన్ల కామెంట్స్‌కు ఫన్నీగా సమాధానాలిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్‌ చేసిన కామెంట్‌కు తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చిన సామ్. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను పోస్ట్ చేసిన చేసిన సమంత ఫీలింగ్ గుడ్ అంటూ కామెంట్ పెట్టింది. దీనికి నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ ‘చై కి విడాకులు ఇచ్చేయ్.. మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం’ అంటూ కామెంట్ చేశాడు. దీనికి స్పందించిన సమంత.. ‘కష్టం... ఒక పని చెయ్..చై ని అడుగు’ అంటూ కౌంటర్ చేసింది. సమంత సమాధానానికి ఫిదా అయిపోయిన నెటిజన్లు ఎంతైనా సామ్ గ్రేట్ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34X2KH1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...