Thursday, 26 November 2020

Parvathy Jayaram: ‘భాగమతి’ విలన్ జయరాం భార్య గురించి తెలిస్తే షాకవుతారు

సినిమా ఇండస్ట్రీలో కొందరు నటులు ఎంత వేగంగా పేరు తెచ్చుకుంటారో వచ్చారో అంతే త్వరగా కనుమరుగైపోతుంటారు. మరికొందరేమో దశాబ్దాల తరబడి ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా అలరిస్తుంటారు. తెలుగులో అలాంటి నటులు ఎంతో మంది ఉన్నారు. అలాగే మలయాళ సినీ పరిశ్రమలో అంటే తెలియనివారు ఉండరు. తొలుత మిమిక్రీ ఆర్టిస్ట్‌గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న జయరాం.. 1988లో ‘అపరన్’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన అగ్రహీరోగా ఎదిగారు. భాగమతి, అల వైకుంఠపురములో.. చిత్రాల ద్వారా ఇటీవలే తెలుగు ప్రేక్షకులను అలరించారు. పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్లో రానున్న చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు. సుమారు 200 చిత్రాల్లో నటించిన ఆయనకు కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. సుమారు నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న జయరాం భార్య కూడా ఒకప్పటి టాప్ హీరోయిన్ అని చాలా కొద్దిమందికి మాత్రమే. వారిది ప్రేమ వివాహం. మలయాళంలో ఒకప్పడు అగ్ర హీరోయిన్‌గా కొనసాగిన పార్వతిని జయరాం 1992లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సుమారు 70 సినిమాల్లో నటించిన పార్వతి కాస్ట్యూమ్ డిజైనర్ కూడా. వీరికి ఓ కొడుకు కాళిదాస్ , కూతురు మాళవిక ఉన్నారు. కాళిదాస్ ‘కొచు కొచు సంతోషమంగిల్’ అనే మలయాళ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి కాళిదాస్ చిన్నప్పుడే జాతీయ అవార్డు అందుకుని తండ్రికి తగ్గ తనయుడినని నిరూపించుకున్నారు. ఇఫ్పుడు టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఆయనకు మంచి క్రేజ్ ఉంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33fEfUk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...