తీన్‌మార్, ఒంగోలు గిత్త, బ్రూస్‌లీ... సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది . టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ ఛాన్సులు దక్కించుకుంటూ బిజీగా మారింది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్‌తో ప్రేమలో పడినట్లు వెలుగులోకి వచ్చింది. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని మీడియాలో వార్తలొచ్చాయి. ఈ న్యూస్‌పై స్పందించిన కృతి ప్రేమ విషయంలో క్లారిటీ ఇచ్చింది. ‘పులకిత్ చాలా మంచి వ్యక్తి అని, ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. ఏడాదిన్నరగా డేటింగ్ చేస్తున్నాం. అయితే ఇద్దరి ఫోకస్ ఇప్పుడు కెరీర్ మీదే ఉంది. అందువల్ల ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించిన తర్వాతే పెళ్లి చేసుకుంటాం’ అని కృతి చెప్పుకొచ్చింది. కృతి, పులకిత్ ఇద్దరు కలిసి ‘పాగల్ పంథీ’ చిత్రంలో కలిసి నటించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33lDERb
v
No comments:
Post a Comment