Thursday, 26 November 2020

‘పుష్పక విమానం’లో అమలకు ఛాన్స్... మేనేజర్‌పై కోప్పడిన మాధురీ దీక్షిత్

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కమల్‌హాసన్, అమల జంటగా తెరకెక్కిన ‘పుష్పక విమానం’ భారతీయ సినీ చరిత్రలోనే ఓ అద్భుతంగా నిలిచిపోయింది. మాటల్లేకుండా కేవలం హావభావాలతోనే నడిచే కథతో ప్రేక్షకులను మెప్పించిన ఘటన నటీనటులదే. ఇందులో అమల అందం, అభినయం అందరినీ ఫిదా చేశాయి. అయితే ఈ సినిమాలో ఫస్ట్ ఛాయిస్ అమల కాదంట.. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు.. హీరోయిన్‌గా ఓ బాలీవుడ్‌ నటిని అనుకోగా.. ఆమె హ్యాండ్ ఇవ్వడంతో చివరికి అమలను తీసుకున్నారట. Also Read: ‘పుష్పక విమానం’ సినిమా కోసం హీరోయిన్‌ కోసం సింగీతం వెతుకుతున్న సమయంలో ఆయనకు తెలిసిన వ్యక్తి ఓ అమ్మాయిని సూచించారట. ఆమె హిందీలో కొన్ని సినిమాలు చేసినా ఇంకా విడుదల కాలేదని, ఐరన్‌లెగ్ సెంటిమెంట్ లేకపోతే ఆమెను తీసుకోవాలని సూచించారట. ఆ అమ్మాయి ఎవరో కాదు మాధురీ దీక్షిత్. సింగీతం ఆమె మేనేజర్‌ని సంప్రదించగా.. మాటల్లేని సినిమాల్లో మాధురి నటించదని ఆయన తేల్చి చెప్పేశారట. ఆ తర్వాత ఓ కార్యక్రమంలో అమలని చూసిన సింగీతం ఆ పాత్రకు చక్కగా సరిపోతుందని భావించి ఆమెను సెలక్ట్ చేశారట. అలా మాధురి చేజారిన లక్కీఛాన్స్ అమలకు దక్కింది. ఈ సినిమాతో అమల నటిగా పదిమెట్లు ఎక్కారనే చెప్పొచ్చు. ఈ సినిమా విడుదలై ఘనవిజయం సాధించిన కొద్దిరోజులకు అసలు విషయం తెలుసుకున్న మాధురీ దీక్షిత్.. మంచి అవకాశం పోగొట్టావంటూ మేనేజర్‌పై మండిపడ్డారట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2J9fZfG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...