Friday, 6 November 2020

సామ్ జామ్: సమంత సెలబ్రిటీ టాక్ షో.. లిస్ట్‌లో సూపర్ స్టార్లు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని వారి కోడలు సరికొత్త సెలబ్రిటీ టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అచ్చ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’తో కలిసి ఆమె ఈ టాక్ షో చేస్తున్నారని అన్నారు. ఈ వార్తలను నిజం చేస్తూ ‘ఆహా’ అధికారిక ప్రకటన చేసింది. ‘సామ్ జామ్’ అనే టైటిల్‌‌తో ఈ టాక్ షో వస్తోంది. ‘ఆహా’ చైర్మన్ అల్లు అరవింద్, సమంత, డైరెక్టర్ నందిని రెడ్డి సంయుక్తంగా శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించి ఈ షోను ప్రకటించారు. ఈ టాక్ షో ద్వారా టాలీవుడ్‌లోని పేరుమోసిన సూపర్ స్టార్లను సమంత ఇంటర్వ్యూ చేయనున్నారు. అలాగే, ఇతర రంగాలకు చెందిన సెలబ్రిటీలతో కూడా ఆమె ముచ్చటించనున్నారు. ఈరోజు విడుదల చేసిన ప్రచారం చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, తమన్నా, రష్మిక మందన, సైనా నెహ్వాల్ - పారుపల్లి కశ్యప్ దంపతులు ఉన్నారు. ఈ షో నవంబర్ 13 నుంచి ప్రారంభం కానుంది. ఈ టాక్ షోకు సంబంధించి ఒక ప్రోమోను శుక్రవారం విడుదల చేశారు. Also Read: ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘ఆహా’ 18 మిలియన్ యూజర్లను సొంతం చేసుకుందని చెప్పారు. ‘ఆహా’ను మరో స్థాయికి తీసుకెళ్లడంలో భాగంగా సమంత లాంటి బిగ్ స్టార్‌తో ఈ షోను ప్లాన్ చేశామని వెల్లడించారు. ఈ షోలో సినిమా స్టార్లతో పాటు స్పోర్ట్స్ స్టార్లను తీసుకొచ్చి దీని ద్వారా ‘ఆహా’ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేయాలని నిర్ణయించుకున్నట్టు ఆయన తెలిపారు. దీపావళి రోజు ‘ఆహా’ ఒక భారీ వేడుకను నిర్వహించబోతోందని, ఆ రోజు తమ కొత్త ప్రణాళికను వెల్లడిస్తామని అరవింద్ స్పష్టం చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2GzktuR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...