ప్రముఖ నిర్మాత పి.డి.వి. ప్రసాద్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య అంజు ప్రసాద్ గుండెపోటుతో మృతిచెందారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అంజు తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 53 ఏళ్లు. ప్రసాద్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పి.డి.వి. ప్రసాద్ ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించే చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా.. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించే చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారనే విషయం విదితమే. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’, ‘భీష్మ’, ‘జెర్సీ’, ‘అ ఆ’ వంటి హిట్ సినిమాలు వచ్చాయి. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2U1P7A6
v
No comments:
Post a Comment