Friday, 6 November 2020

ఒక్కసారిగా టేప్ ఊడిపోయింది.. అందరిముందే డ్రెస్ జారిపోతుందని టెన్షన్ పడ్డా.. ప్రియాంక చోప్రా ఓపెన్

గ్లోబల్ స్టార్ అందాల గురించి వర్ణించాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ హీరోయిన్‌గా భారీ పాపులారిటీ కూడగట్టుకొని ప్రపంచ స్థాయి ఫాలోయింగ్ ఏర్పర్చుకుంది ఈ ముద్దుగుమ్మ. 38 ఏళ్ల వయసులోనూ ఫ్యాషన్ ఐకాన్‌గా కొనసాగుతూ కుర్రకారు మనసు దోచుకుంటున్న ఈ బ్యూటీ.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు పర్సనల్ విషయాలు చెబుతూ ఓపెన్ అయింది. తను ధరించిన డ్రెస్‌ల వల్ల పలు సందర్భాల్లో అసౌకర్యానికి గురయ్యానని తెలిపింది. 2000 సంవత్సరం మిస్ వరల్డ్ కీరీటం గెలుచుకున్న సమయంలో తన డ్రెస్ చాలా ఇబ్బంది పెట్టిందని చెప్పింది ప్రియాంక. ఆ సమయంలో వేసుకున్న వేసుకున్న తెలుపు రంగు డ్రెస్ టేప్ అనుకోకుండా మొత్తం ఊడిపోవడంతో డ్రెస్ జారిపోతుందేమోనని భయం వేసిందని పేర్కొంది. వేదిక మీద నడిచిన ప్రతిసారి నమస్కారం పెడుతున్నట్టు చేతులు పెట్టి ఆ డ్రెస్ జారిపోకుండా కాపాడుకునే దాన్నని చెబుతూ ఆనాటి ఇబ్బందులను గుర్తుచేసుకుంది ప్రియాంక. Also Read: ఇకపోతే 2018 సంవత్సరంలో మెట్ గాలా లుక్ కోసం ధరించిన బ్లడ్ రెడ్ కలర్ డ్రెస్ కూడా చాలా ఇబ్బందిపెట్టిందని తెలిపిన ప్రియాంక చోప్రా.. ఆ డ్రెస్ చాలా బరువుంటుందని, ఆ బరువుతో నడుము ఆకారం మారిపోతుందేమోనని భయమేసేదని ప్రియాంక తెలిపింది. దీంతో ప్రియాంక చెప్పిన ఈ డ్రెస్ సీక్రెట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనకంటే పదేళ్లు చిన్నవాడైన హలీవుడ్‌ గాయకుడు నిక్‌ జోనాస్‌‌ని ప్రేమించి పెళ్లాడిన ప్రియాంక.. ప్రస్తుతం ఆయనతో జాలీ లైఫ్ గడుపుతోంది. ఇటీవలే ఈ దంప‌తులు ఘ‌నంగా క‌ర్వా చౌత్ వేడుక‌ను జరుపుకున్నారు. భర్త నిక్‌ జోనాస్ శ్రేయస్సు కోరుకుంటూ ఉపవాస దీక్ష చేసింది ప్రియాంక. ఈ పర్వదినాన హార‌తి పళ్లెం ప‌ట్టుకొని ఎర్రటి సారీతో ట్రెడిషినల్ లుక్‌లో ఆమె ఆకట్టుకుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2I4qsZ3
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...