Friday, 20 November 2020

హీరో సూర్యతో మల్టీస్టారర్.. క్రేజీ డైరెక్టర్‌ ప్లాన్

సినిమాలో పాత్ర నచ్చాలే గానీ తమిళ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. దర్శకత్వంలో ‘శివపుత్రుడు’లాంటి సినిమాలో నటించి మెప్పించారాయన. అందులో విక్రమ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం మరో విశేషం. ఆ చిత్ర దర్శకుడు బాలా ముగ్గురు హీరోలతో ఓ సినిమా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నార. ఈ మల్టీస్టారర్ కోసం ఆయన స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారట. ఇందులో సూర్య, అథర్వ, ఆర్య నటిస్తే బాగుంటుందని బాలా అనుకుంటున్నారట. ఈ ముగ్గురూ గతంలో బాలా దర్శకత్వంలో నటించిన వారే. తన కొత్త చిత్రం కోసం బాలా ఈ ముగ్గురు హీరోలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. విక్రమ్‌ తనయుడు ధ్రువ్‌ హీరోగా తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ సినిమా తమిళంలో తెరకెక్కించారు బాలా. ఆ సినిమా డిజాస్టర్‌ కావడంతో పాటు చూసిన వారంతా బాలాను తిట్టిపోసుకున్నారు. దీంతో ఇన్నాళ్లూ తన విలక్షణమైన సినిమాలతో సంపాదించుకున్న క్రేజ్ మొత్తం పోయింది. దీంతో ఈసారి తనకు అచ్చొచ్చిన మల్టీస్టారర్‌తో మంచి హిట్ కొట్టాలని బాలా నిశ్చయించుకున్నారట. మరోవైపు ‘ఆకాశం నీ హద్దురా’తో సంచలన విజయం తన ఖాతాలో వేసుకున్న సూర్య ఈ మల్టీస్టారర్‌లో నటిస్తున్నారన్న ప్రచారంతో కోలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. మల్టీస్టారర్ చిత్రాల్లో సూర్య కనిపించడంతో కొత్తేమీ కాదు. గతంలో ‘శివపుత్రుడు’లో విక్రమ్‌తో, ‘బందోబస్త్‌’లో మోహన్‌లాల్‌, ఆర్యతో కలిసి నటించారు. ప్రస్తుతం ఆయన మణిరత్నం నిర్మిస్తున్న ‘నవసర’ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. దీనికి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/334mvv6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...