యంగ్ టైగర్ ఎన్టీఆర్, కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘అరవింద సమేత’లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలిసి పనిచేస్తున్ సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగులో బిజీగా ఉన్నారు. కాస్త విరామం లభించడంతో కుటుంబంతో కలిసి దుబాయ్‌లో విహరించి వచ్చారు. కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లకుండా ఆగిపోయింది. ఎన్టీఆర్ ఎప్పుడు రెడీ అంటే అప్పుడు షూటింగ్ మొదలు పెట్టేందుకు త్రివిక్రమ్ సిద్ధంగా ఉన్నారు. Also Read: అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలన్న దానిపై యూనిట్ సభ్యులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రస్తుతం క్రేజీ హీరోయిన్‌గా ఉన్న పూజా హెగ్డేని తీసుకుంటారని వార్తలొచ్చినా.. త్రివిక్రమ్ ఆమెతో ఇప్పటికే ‘అరవింద సమేత’, ‘అల వైకుంఠపురములో’ సినిమాలు తీశాడు. దీంతో ఫ్రెష్ లుక్ అనిపించదన్న కారణంతో ఆమె పేరు పక్కన పెట్టారట. ప్రస్తుతం కీర్తి సురేష్‌తో పాటు బోల్డ్ బ్యూటీ కేతికా శర్మను పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆకాష్ పూరీతో ‘రొమాంటిక్’ సినిమాలో నటిస్తోంది. అందాల ఆరబోతతో కుర్రకారు మతిపోగొట్టే కేతికా శర్మ అయితే సినిమాకు మరింత హైప్ క్రియేట్ అవుతుందని యూనిట్ భావిస్తోందట. త్రివిక్రమ్ క్రియేట్ చేసిన గ్లామర్ పాత్రకు కేతికా అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని భావించడంతో దాదాపుగా ఆమెకే ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక సమాచారం రానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35QqD3O
v
No comments:
Post a Comment